Switch to English

CBN Arrest: బ్రేకింగు.! షాకింగు.! చంద్రబాబు అరెస్టు.! తర్వాతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు.! స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొద్ది సేపటి క్రితం ‘నాన్ బెయిలబుల్’ కింద చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది.

అరెస్టుకు ముందర హైడ్రామా నడిచింది. చంద్రబాబుని అరెస్టు చేసేందుకోసం ఏపీ సీఐడీ, భారీ ఏర్పాట్లు చేసుకుంది. రాత్రి నుంచీ నడిచిన హైడ్రామా, తెల్లారేసరికి ఓ కొలిక్కి వచ్చింది. చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆయన్ని అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ.

తన అరెస్టుకి కారణాలు చెప్పాల్సిందిగా చంద్రబాబు, ఏపీ సీఐడీని అడిగారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించేశారు. కోర్టుకు అన్ని వివరాలూ సమర్పిస్తామని ఏపీ సీఐడీ పేర్కొంది. అరెస్టు అప్రజాస్వామికమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

ప్రజలు కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు, అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు అరెస్టవుతారంటూ అధికార వైసీపీ చెబుతూనే వచ్చింది. వ్యక్తిగత పనుల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశాలకు వెళ్ళిన సమయంలో, వ్యూహాత్మకంగా చంద్రబాబు అరెస్టు జరగడం గమనార్హం.

కాగా, తన తండ్రి అరెస్టు నేపథ్యంలో ఆయన్ని కలిసేందుకు వెళతానంటూ పాదయాత్రలో వున్న నారా లోకేష్ ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్‌ని పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అరెస్టయ్యారు సరే.. తర్వాతేంటి.? చంద్రబాబు అరెస్టు విషయమై మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. శనివారం అరెస్టు జరిగిన దరిమిలా, సోమవారం వరకూ బెయిల్ కస్టమేనని ప్రచారం జరుగుతోంది. కాగా, గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏపీ సీఐడీ అరెస్టు చేసినప్పుడు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలున్నాయి. అదే ట్రీట్మెంట్ చంద్రబాబుకీ జరుగుతుందని వైసీపీ సోషల్ మీడియా కార్మికులు పేర్కొంటుండడం గమనార్హం. అలా జరుగుతుందా.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....