Switch to English

బీజేపీ ఎంపీ ఉవాచ: బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా పోతుందట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం ఆగడంలేదు. మన దేశంలో కూడా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేసులపరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రష్యా ఈ విషయంలో వ్యాక్సిన్ తీసుకొచ్చినా.. దానిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ప్రయోగాలు పూర్తిచేసుకునే టీకాలు ఆరు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడం ఒక్కటే మానవాళి ముందున్నమార్గం.

రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారం తీసుకోవడంతోపాటు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఇంట్లో ఉండటమే ఉత్తమం. పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది మాత్రం చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ.. అలా చేస్తే కరోనా రాదు, ఇలా చేస్తే వైరస్ పోతుంది అని చెప్పడం విస్తు గొలుపుతోంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కొంతమంది బీజేపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు.

తాజాగా బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్.. కరోనా పోవడానికి ఓ చిట్కా చెప్పారు. బురదలో కూర్చుని ఒళ్లంతా దానిని పూసుకుని, శంఖం ఊదితే ఈ మహమ్మారి మన దరి చేరదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయన అలా ఒళ్లంతా బురద పూసుకుని శంఖం ఊది చేసి చూపించారు. ’’మన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సమర్థంగా పనిచేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. శంఖం గట్టిగా ఊదగలిగితే అవి సక్రమంగా ఉన్నట్టే. రోగనిరోధక శక్తి అనేది ఔషధాల నుంచి రాదు. అది సహజంగా ప్రకృతి నుంచి రావాల్సిందే.

బురదలో కూర్చుని గట్టిగా శంఖం ఊదడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ఎండ, వానలతో మమేకమవ్వాలి’’ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చుట్టూ మంట వేసి, మధ్యలో కూర్చుని యోగాసనాలు వేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా బురదలో కూర్చుని మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతనెలలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భాభీజీ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా రాదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...