దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్న బిగ్‌బాస్‌ను మూడు సంవత్సరాల క్రితం తెలుగులో కూడా ప్రారంభించిన విషయం తెల్సిందే. మూడు సీజన్లు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. హోస్ట్‌ల విషయంలో కాస్త గందరగోళం ఉన్నా కూడా ఖచ్చితంగా నాల్గవ సీజన్ ఎప్పటి మాదిరిగానే భారీగా నిర్వహించేందుకు స్టార్ మా సన్నాహాలు మొదలు పెట్టింది. కరోనా కారణంగా ఏర్పాట్లు కాస్త ఆలస్యం అయ్యాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జాబితా రెడీ అయ్యింది.
వంద మంది సెలబ్రెటీలతో జాబిత రెడీ అయ్యింది. వారిలోంచి 25 మందితో షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయబోతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పక్రియ కూడా పూర్తి కానుంది. నాల్గవ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని ఇప్పటికే స్టార్ మా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వచ్చే నెలలో షో కు సంబంధించిన ప్రకటనను స్టార్ మా చేసే అవకాశం ఉంది.
ఆగస్టు లేదా సెప్టెంబర్ రెండవ వారంలో బిగ్ బాస్ 4 టెలికాస్ట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీవీ9 నుండి తప్పుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చెవెళ్ల రవి బిగ్‌బాస్ కారణంగానే తన ఇస్మార్ట్ న్యూస్‌కు రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన సన్నిహితుల వద్ద బిగ్ బాస్ నిర్వాహకుల నుండి కాల్ వచ్చిందని అన్నాడట. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారికంగా బిగ్ బాస్ 4 గురించిన చర్చ జరగడం లేదు.
732692 575184Wow really glad i came across your internet web site, i??ll be positive to check out back now i??ve bookmarked it??. 589008
380231 233577What a lovely weblog page. I will certainly be back once again. Please keep writing! 996332
826284 567508Hi, you used to write excellent articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past few posts are just just a little out of track! 974845
430967 16671Respect to author , some excellent info . 101384