Switch to English

Bigg Boss Telugu7: బిగ్ బాస్ బాయ్స్ హాస్టల్.! ఏంటయ్యా నాగార్జునా ఇది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బ్యాక్ టు బ్యాక్.. మహిళా కంటెస్టెంట్లనే బిగ్ బాస్ ఇంటికి పంపించేశాడు ఈసారి.! ఏం పైత్యమిది.? బిగ్ హౌస్‌లో అస్సలేమాత్రం గ్లామర్ వుండకూడదని ఫిక్సయ్యారా.? ఏమో అంతేనేమో.! ఐదుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోవడంతో, మిగిలిన ఇద్దరు మహిళా కంటెస్టెంట్లు శోభా శెట్టి, ప్రియాంక జైన్.. బిగ్ బాస్ హౌస్‌ని బాయ్స్ హాస్టల్‌గా ఫీల్ అయ్యారు. ఇదే విషయాన్ని అక్కినేని నాగార్జున మొహమ్మీదనే చెప్పేశారు.

అక్కినేని నాగార్జున సీరియస్‌గా తీసుకోలేదుగానీ, సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే ఇది. దాదాపుగా ప్రతి వీకెండ్‌లోనూ బిగ్ జీరో అనిపించుకుంటున్న కంటెస్టెంట్ అమర్‌దీప్. కానీ, అతన్ని హౌస్‌లో ఎలా కొనసాగిస్తున్నారో ఏమో.! రతిక, శుభశ్రీ రాయగురు, దామిని భాట్ల.. ఈ ముగ్గురూ హౌస్‌లో వుండాల్సినవాళ్ళే.

ఐదుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు గనుక, ఓ ముగ్గురు లేడీ కంటెస్టెంట్లను తీసుకొచ్చేయాలని అనుకున్నారేమో. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ ముచ్చటా తీర్చేశారు. పూజా, నయన పావని, అశ్విని శ్రీ.. ఈ ముగ్గురూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారట. పైగా, ఇది ‘టూ పాయింట్ ఓ’ అట.!

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి.. అన్నట్లుంది వ్యవహారం. సీక్రెట్ రూమ్‌లో గౌతమ్ కృష్ణని పెట్టి, మరో ఇద్దరు మేల్ కంటెస్టెంట్లను అదనంగా తీసుకొచ్చారు. ఆ సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ అత్యంత ఛండాలం. అయినా, దాన్ని రిపీట్ చేశారు.. పైగా, జీరో ఎక్సయిట్‌మెంట్‌తో.

ఓ వైపు టీమిండియా – క్రికెట్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ వన్డే మ్యాచ్, ఇంకో వైపు ‘భగవంత్ కేసరి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. వీటి నడుమ, బిగ్ బాస్ రియాల్టీ షో వీకెండ్ ఎపిసోడ్.. దానికి ‘టూ పాయింట్ ఓ’ అని పేరు పెట్టినా.. పప్పులుడకలేదాయె.

హీరో సిద్ధార్ధ వచ్చాడు.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా టీమ్ మాస్ మహరాజ్ రవితేజ సహా వచ్చింది.. ప్చ్.. వీకెండ్ షో అట్టర్ ఫ్లాప్ అయిపోయిందాయె.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...