Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 74 – అమ్మలు వచ్చి అంతా మార్చేశారు, పీక్స్‌లోకి ఎమోషన్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ లో కూడా చివరి నాలుగు అయిదు వారాలు ఉంది అనగా కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులను హౌస్‌లోకి పంపించడం జరుగుతుంది. ఈసారి కూడా కంటెస్టెంట్స్‌ పంపించారు. అయితే కరోనా కారణంగా ఈ ఈసారి ఇంటి సభ్యులను వారి ఇంటి సభ్యులు నేరుగా కలవకుండా గ్లాస్‌ క్యాబిన్‌లో ఉండి మాట్లాడి వెళ్లి పోయారు. కంటెస్టెంట్స్‌ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని గ్లాస్‌ క్యాబిన్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. గ్లాస్‌ అవతల వైపు నుండి కుటుంబ సభ్యులు వారి వాళ్లను కలిసే అవకాశం వచ్చింది. ఇంతకు ముందు సీజన్‌ ల్లో కంటెస్టెంట్స్‌ తో వారి కుటుంబ సభ్యులు కొంత ఏకాంతంగా గడిపే అవకాశం ఉండేది. కాని ఈసారి అలా జరగలేదు. 74 ఎపిసోడ్‌ మొత్తం ఫుల్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌ తో నిండి పోయింది.

కమాండో డ్రిల్‌ చేస్తున్న ఇంటి సభ్యులకు సర్‌ప్రైజింగ్‌గా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకు వచ్చారు. బిగ్‌ బాంబ్‌ వల్ల అవినాష్‌ నాన్‌ వెజ్‌ తినలేక పోతున్నాడు. దాంతో సోహెల్‌ అతడి ముందు మటన్‌ తింటూ మరీ అల్లరి చేశాడు. ఏమైనా ఉందా మటన్‌ అంటూ అతడి జిహ్వ చాపల్యంను పరీక్షించాడు. సోహెల్‌ చేసిన పనితో అబ్బా అనుకుంటూ అవినాష్‌ అక్కడ నుండి వెళ్లాడు. ఇంటి సభ్యులు అంతా ఫ్రీజ్‌ లో ఉన్న సమయంలో బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి అఖిల్‌ మదర్‌ వెళ్లారు. ఆమెను చూడగానే అఖిల్‌ కన్నీరు పెట్టుకున్నాడు. ఏడవద్దంటూ అఖిల్‌కు సూచించిన ఆమె అన్‌ ఫ్రీజ్‌ అంటూ బిగ్‌బాస్ ఆదేశించడంతో అంతా కూడా ఆమె వద్దకు వెళ్లారు.

నీలాంటి కూతురు కావాలని ఉంది అంటూ హారికను ఉద్దేశించి అఖిల్‌ తల్లి అన్నారు. అభిజిత్‌, అఖిల్‌ల విషయం మాట్లాడిన ఆమె అభిజిత్‌ నీ అన్న అంది. మేము టాస్క్‌ల్లో భాగంగా గొడవ పడతాం తప్ప వ్యక్తిగతంగా అయితే ఏమీ లేదంటూ అభిజిత్‌ అన్నాడు. అందరి గురించి మాట్లాడి మోనాల్‌ గురించి మాట్లాడక పోవడంతో నీ ఫ్రెండ్‌ కదా అంది. సరదాగా మాట్లాడిన ఆమె కొద్ది సమయం తర్వాత వెళ్లి పోయింది. ఆ తర్వాత అఖిల్‌, అభిజిత్‌, సోహెల్‌ లు ఎమోషనల్‌గా హగ్‌ చేసుకున్నారు. హారిక తల్లి రాకతో మరోసారి ఇంట్లో సందడి వాతావరణం కనిపించింది. కూతురును ఆట పట్టిస్తూనే ఇంటి సభ్యులు అందరిని అభినందించింది. హారికను బాగా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు అంటూ అభిజిత్‌కు తెలియజేసింది. ఈసారైనా కెప్టెన్‌ అవుతావా అంటూ హారికను అమ్మ ఉడికించింది.

ఆ తర్వాత అభిజిత్‌ అమ్మ వచ్చారు. ఆమె కూడా ఇంటి సభ్యుల్లో జోష్‌ నింపేలా మాట్లాడారు. కన్నీరు పెట్టుకుంటున్న తల్లిని వద్దని చెప్పిన అభిజిత్‌ ఆమెను ఓదార్చాడు. ఒక్కరోజు ఇక్కడ ఉండాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. బాగా కొట్టుకోండి అంటూ నవ్వుకుంటూ అన్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ దొరకదు. ఎంజాయ్‌ చేయండి అంటూ డాన్స్‌ కూడా చేసి వెళ్లారు. అవినాష్‌ తల్లి రావడం రావడంతోనే నీకు బయటకు రాగానే పెళ్లి చేస్తాం ఊరికే అదే మాట్లాడకు అంది. ఆమె కూడా చాలా సరదాగా మాట్లాడింది. మొత్తానికి తాజా ఎపిసోడ్‌ అమ్మల రాకతో చాలా ఎమోషనల్‌ గా మారింది. మరికొందరు కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...