Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 16 – ఎలిమినేషన్‌ నామినేషన్‌ లో నిప్పులు చెరిగిన కంటెస్టెంట్స్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మూడవ వారంలోకి బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 తెలుగు అడుగు పెట్టింది. శని, ఆదివారం ఎపిసోడ్స్‌ లో నాగార్జున ఇచ్చిన డోస్‌ మరియు పెట్టిన పుల్లలతో ఇంట్లో చాలా మందికి ఒకరిపై ఒకరికి గొడవలు అవుతున్నాయి. ఆ గొడవల ప్రభావం నిన్న జరిగిన ఎలిమినేషన్‌ నామినేషన్‌ లో క్లీయర్‌ గా కనిపించింది. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేయాలంటూ ఫొటోలు మరియు మంట పెట్టారు. మంటల్లో ఫొటో వేసి ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

గత వారం ఎలిమినేట్‌ అయిన కరాటే కళ్యాణి వెళ్తూ వెళ్తూ టీవీ9 దేవిని నేరుగా నామినేట్‌ చేసి వెళ్లింది. ఇక కెప్టెన్‌ అయిన నోయల్‌ కు బిగ్‌ బాస్‌ ప్రత్యేక అధికారం ఇచ్చి ఒక్కరిని నేరుగా నామినేట్‌ చేయమంటూ ఆదేశించగా ఆయన లాస్య ను ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. అమ్మ రాజశేఖర్‌, దివి వషయంలో లాస్య మాట్లాడటం వల్ల నామినేట్‌ చేసినట్లుగా నోయల్‌ చెప్పాడు.

దేవి, లాస్యలు ముందే నామినేట్‌ అవ్వడం మరియు నోయల్‌ కెప్టెన్‌ అవ్వడం వల్ల ఆయనకు ఇమ్యూనిటీ దక్కడంతో ఆ ముగ్గురు కాకుండా ఇతరులను నామినేట్‌ చేయాలంటూ బిగ్ బాస్‌ ఆదేశించాడు. దాంతో ఎక్కువ శాతం మంది కుమార్‌ సాయిని నామినేట్‌ చేశారు. ఇక గంగవ్వను ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేయలేదు. దాంతో గడచిన రెండు వారాలుగా ఎలిమినేషన్‌ లో ఉన్న గంగవ్వ ఈసారి మాత్రం లేదు. ఈసారి ఎలిమినేషన్‌ లో దేవి, లాస్య, కుమార్‌ సాయి, అరియానా, మోనాల్‌, హారిక, మెహబూబ్‌లు ఉన్నారు.

మోనాల్‌ మరియు అరియానాలు తక్కువ ఓట్లతో ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. ఎలిమినేషన్‌ కు నామినేట్‌ చేసే సమయంలో కొందరు అవతలి వారిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కుమార్‌ సాయిపై ఇద్దరు ముగ్గురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హారిక మరియు సుజాత, అభిజిత్‌లు కూడా నామినేట్‌ చేస్తున్న సమయంలో తీవ్రంగా స్పందించారు.

ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో కుమార్‌ సాయి డేంజర్‌ జోన్‌ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గత వారమే ఆయన కరాటే కళ్యాణీ ఎలిమినేషన్‌ లో లేకుంటే ఆయన వెళ్లి పోయేవాడు అంటూ అంతా అనుకున్నారు. ఈసారి ఖచ్చితంగా కుమార్‌ సాయికి మూడింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు రేపు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్స్‌ లో ఆయన ఏమైనా అద్బుతాలు క్రియేట్‌ చేయడం లేదంటే ఆయనకు ఏదైనా విషయంలో సింపతి రావడం జరిగితే తప్ప అప్పుడు ఆయన సేవ్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

3 COMMENTS

  1. 500659 562804Good post. I learn something much more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice a little something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 521724

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...