Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వైఎస్‌ జగన్‌ ‘ఆగస్ట్‌ 15’ డెడ్‌లైన్‌ ఏమవుతుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘‘నారా చంద్రబాబునాయుడుగారూ.. మాకు ప్రభుత్వం ఇవ్వదలచుకున్న పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు..’’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు లేఖలు రాయిస్తున్నారు. ‘టీడీపీనే ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమానికి అడ్డు తగులుతోంది..’ అంటూ వైసీపీ పదే పదే ఆరోపిస్తోన్న విషయం విదితమే. కానీ, అసలు విషయం వేరు.

మార్చి నెలాఖరున ఇవ్వాల్సిన ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎన్నికలు, కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. నిజానికి, రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ, సేకరణ.. రసాబాసగా మారిన విషయం విదితమే. చాలా చోట్ల వివాదాలు తలెత్తుతున్నా, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. ఇదీ అసలు సమస్య.

భూమి అంటేనే వివాదం.. అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి ఇటీవలి కాలంలో. అమరావతి విషయంలో ఏం జరిగిందో చూశాం. అలాంటిది, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు.. పేదల కోసం సేకరించడమంటే చిన్న విషయం కాదు కదా.! మరి, సమస్య ఇంత పెద్దదైనప్పుడు.. సరైన ‘గ్రౌండ్‌ వర్క్‌’ చేయకుండా ఇళ్ళ స్థలాల పంపిణీకి ముహార్తాలు నిర్ణయించేయడం ప్రభుత్వం వైఫల్యంగానే అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరోపక్క, చంద్రబాబు హయాంలో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ఇళ్ళున్నాయి. వాటిల్లో కొన్ని లబ్దిదారులకు గతంలోనే కేటాయింపబడ్డా, లబ్దిదారులకు వాటిని ఇంకా ఇవ్వలేదు. భూముల వ్యవహారం వివాదాల్లో వున్నప్పుడు, కట్టిన ఇళ్ళను అయినా లబ్దిదారులకు ఇచ్చేయాలి కదా.! ఇదే ప్రశ్న న్యాయస్థానం నుంచి తాజాగా ప్రభుత్వానికి ఎదురయ్యింది.

‘గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది..’ అంటూ అధికార పార్టీ నేతలు, మీడియాకెక్కి నానా రచ్చా చేస్తున్నారు.. ‘కట్టిన ఇళ్ళను పేదలకు ఎందుకు ఇవ్వడంలేదు’ అని ప్రశ్నిస్తే.! అదే సమాధానం న్యాయస్థానాల దగ్గర చెబితే కుదరదు కదా.! పోనీ, వివాదాల్లేని భూముల్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే బావుండేది కదా.? అన్న ప్రశ్నకీ ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం దొరకని పరిస్థితి.

రాజమండ్రి సమీపంలోని ఆవ భూములు కావొచ్చు, మరో జిల్లాలో దళితుల భూములు కావొచ్చు.. ఇంకో చోట ఏళ్ళ తరబడి పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములు కావొచ్చు.. మడ అడవుల పరిధిలోకి వచ్చే బూములు కావొచ్చు. వీటి చుట్టూ వివాదాలుంటాయని తెలిసీ, ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

తాజా డెడ్‌లైన్‌ ఆగస్ట్‌ 15.. ఈలోగా పరిస్థితులు ఏమంత అనుకూలంగా మారేలా కన్పించడంలేదు. మరి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆలోచన ఏంటి.? షరామామూలుగానే విపక్షాలపై బురదచల్లేసి.. ఇంకోసారి ‘వాయిదా’ అంటుందేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...