Switch to English

ఏపీ సీఎస్ పునేఠాపై వేటుకు కారణాలివే…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీ సర్కారు బేఖాతరు చేయడం.. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించడంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వ పెద్దలు అనుసరించిన వైఖరి కారణంగా పునేఠా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవు. చిన్న బదిలీ నుంచి ప్రజల్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా సర్కారు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం సాధారణ పరిపాలన వ్యవహారాలు మినహా విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు.

ఎవరైనా అధికారి లేదా అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదు వస్తే, ఈసీ దానిపై నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటుంది. ఇదే విధంగా ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకకుళం, కడప ఎస్పీల విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫిర్యాదు ఆధారంగా వారిని బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు ఈసీ ఆదేశాలను సక్రమంగా అమలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అంటున్నారు.

తొలుత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ ముగ్గురినీ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠా ఉత్తర్వులు జారీచేశారు. అయితే, దీన్ని సర్కారు పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఏసీబీ డీజీ బదిలీ నిలిపివేయాలని ఆదేశించారు. సర్కారు పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు పునేఠా వ్యవహరించక తప్పలేదు. మరుసటి రోజు ఏసీబీ డీజీ బదిలీ రద్దు చేస్తే సవరణ ఉత్తర్వులు జారీచేశారు.

అంతేకాకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామాలన్నీ ఈసీ ఆగ్రహానికి కారణమయ్యాయి. మరోవైపు హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఏసీబీ డీజీని బదిలీ చేయక తప్పలేదు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదు. అయితే, తమ ఆదేశాలను ధిక్కరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం.. పునేఠాను ఢిల్లీ పిలిపించి, వివరణ అడిగింది.

ఏసీబీ డీజీని బదిలీ చేస్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ఆరా తీసినట్టు సమాచారం. మాకు చట్టం తెలియకుండానే ఏసీబీ డీజీని బదిలీ చేశామా? మా ఆదేశాలను ఎందుకు ఖాతరు చేయలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. తాను సీఎం ఆదేశాల మేరకే నడుచుకున్నానని పునేఠా చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఎన్నికల సంఘం.. పునేఠాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది.

కారాణాలు ఏవైనా.. తమ ఆదేశాలను ధిక్కరించిన సీఎస్ ను ఇంకా అవే బాధ్యతల్లో కొనసాగిస్తే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావించడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అనంతరం 1983 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పునేఠకు తదుపరి పోస్టింగ్‌పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొన్నారు. కాగా, ఏపీ సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీస్‌లో ఇదో కొనసాగింపు మాత్రమేనని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...