Switch to English

కమలనాథులతో కలిసేదెవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార వైఎస్సార్ సీపీపై అటు తెలుగుదేశం, ఇటు జనసేన విపరీతంగా విరుచుకుపడుతుండగా.. బీజేపీ సైతం ఎడాపెడా విమర్శలు చేస్తోంది. వైఎస్సార్ సీపీ అటు టీడీపీని, ఇటు జనసేనను ధీటుగా ఎదుర్కొంటున్నా… బీజేపీ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీతో సత్సంబంధాలు అవసరమనే రీతిలో ముందుకెళ్తోంది.

తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో మళ్లీ కలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కాషయ పార్టీతో జట్టు కట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. తనకున్న పరిచయాలతో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం బాబును అంతగా పట్టించుకోవడంలేదు.

మరోవైపు జనసేన వైఖరి కూడా కాస్త మారింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి దూరంగా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తాజాగా బీజేపీతో కలిసి వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈ విషయలో ఆయన వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. తాను బీజేపీని వీడి బయటకు వెళ్లలేదని సాక్షాత్తు పవనే చెప్పడం.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ప్రశంసలు కురిపించడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

ఇలా టీడీపీ, జనసేన.. బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండటం అధికార పార్టీ నేతల్లో కాస్త కలవరం పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు, తన వ్యక్తిగత అవసరాల దృష్ట్యా తాము కూడా కమలం పార్టీకి జైకొట్టడమే మంచిదనే భావనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన గురువారం రాత్రి హస్తిన వెళ్లారని.. కానీ అమిత్ షా అపాయింట్ మెంట్ లభించకపోవడంతో తిరిగి వచ్చేశారని చెబుతున్నారు.

రాష్ట్రంలో సొంతంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఎవరితోనూ పొత్తుకు సుముఖంగా లేదని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. అందుకే పవన్ ను సైతం జనసేనను బీజేపీలో విలీనం చేయాలని కోరినట్టు చెబుతున్నారు. మొత్తానికి తాము కలుస్తామంటే తాము కలుస్తామంటూ బీజేపీతో పొత్తుకు ఏపీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కమలనాథులు ఎవరితో కలుస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...