Switch to English

అప్పుల కుప్ప ఆంధ్రపదేశ్.. అసలు రాష్ట్రానికి భవిష్యత్తు వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు..’ అని గతంలో విమర్శించిన వైసీపీ, అంతకు మించి అప్పులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.. ఆ లక్ష్యాన్ని అధిగమించింది కూడా. ప్రతి నెలా కొత్త అప్పుల కోసం వెంపర్లాడటం తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి అనేదేమైనా వుందా.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వుంది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మొన్నీమధ్యన ఓ సందర్భంలో మాట్లాడుతూ, అప్పులు చేస్తున్నందుకు గర్వపడుతున్నాం.. అని సెలవిచ్చారు. సగటు మనిషి ఎవడూ అప్పులు చేస్తున్నందుకు గర్వపడడు.. భయపడతాడు. అదే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తే ఎంతలా భయపడాలి.? భయం లేదు.. బాధ్యత అసలే లేదు. సంక్షేమ పథకాలు రాష్ట్రానికి గుది బండలా మారుతున్నాయి. అప్పులు చేయకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రావడమంటే, రాష్ట్రాన్ని ఎటువైపు పాలకులు నడిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

‘చంద్రబాబు చేసిన తప్పుల్ని సరిదిద్దుతున్నాం..’ అని అధికార పార్టీ చెప్పడం చూస్తున్నాం. చంద్రబాబు అప్పలు చేయడాన్ని తప్పు పడుతూ, అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్న వైసీపీ, తప్పులు సరిదిద్దుతోందా.? కొత్త తప్పులు చేస్తోందా.? ఇలా అప్పులు చేసుకుంటూ పోతే, రాష్ట్రానికి అసలు భవిష్యత్తే వుండదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. పలువురు ఆర్థిక వేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే, రాష్ట్రంలో మధ్యం ధరలు ఎక్కువ.. పెట్రోధరలూ ఎక్కువే.. మరి, తద్వారా వచ్చే ఆదాయం ఏమైపోతున్నట్టు.? ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే, ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది. ఎలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలి.? కొత్తగా సంక్షేమం మాటున.. ప్రజల్ని వంచించడానికి ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించాలి.? అన్న ఆలోచన తప్ప, అప్పులు తగ్గించుకుని.. రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం అత్యంత బాధాకరం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...