Switch to English

ఏపీలో సెంటి‘మంట’ వర్కవుటయ్యేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో గెలవడానికి పార్టీల అధినేతలు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వ్యూహాన్ని అవలంభిస్తుంటారు. ప్రజలను ఆకట్టుకునే హామీలిస్తారు.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి జనాలను ఆకర్షిస్తారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో హామీల కంటే సెంటెమెంట్ రగిలించడానికే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మేమొస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెప్పడం కన్నా, వారొస్తే ఏదో జరిగిపోతుందనే భయం జనాల్లోకి ఎక్కించడం మొదలైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అస్త్రంతో దూసుకెళ్లారు. నాలుగున్నరేళ్ల పాలనలో తాను ఏం చేశానో చెప్పడం కన్నా, టీడీపీ అధినేత చంద్రబాబును బూచిగా చూపడానికే ప్రాధాన్యత ఇచ్చారు. మహాకూటమితో చంద్రబాబు చేతులు కలిపిన వెంటనే కేసీఆర్ తన స్వరం మార్చేశారు. కూటమికి ఓట్లేస్తే పరాయి పాలన తెచ్చుకోవడమే అని చెప్పడం ప్రారంభించారు.

ప్రతి సభలోనూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పరాయి పాలన వచ్చినట్టేనని జనాన్ని భయపెట్టారు. దీంతో ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. బాబు వస్తే మన పని ఏమవుతుందో అనే భయం కదలాడింది. అంతే.. టీఆర్ఎస్ కు భారీ మెజార్టీతో గద్దెనెక్కించారు. ఉద్యమ సమయంలో ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్.. ఎన్నికల్లోనూ ఆత్మగౌరవ నినాదంతో విజయం సాధించారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాము చేసింది చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడంతో కేసీఆర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తనను ఏ విధంగా బూచిగా కేసీఆర్ చూపించారో.. ఇప్పడు అదే తరహాలో కేసీఆర్ ను బూచిగా చూపించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు.

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు ఓటేస్తే, అది కేసీఆర్ కు వేసినట్టేనని చెబుతున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు. అయితే, ఇలాంటి సెంటిమెంట్ తెలంగాణలో పనిచేసినట్టుగా ఏపీలో పనిచేస్తుందా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కులం ప్రభావం అంతగా ఉండదు.

ఉమ్మడి రాష్ట్రంలో తమపై వివక్ష చూపించారనే భావం ప్రజల్లో ఎక్కువగా ఉండటంతో మనపాలన.. మన ఆత్మగౌరవం అనే నినాదం వారిలో బలంగా పాతుకుపోయింది. అందువల్లే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. సరిగ్గా అదే సెంటిమెంట్ ను కేసీఆర్ మళ్లీ ప్రజల్లో రగల్చడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ కులం ప్రభావం చాలా ఎక్కువ.

ఈ నేపథ్యంలో బాబు నమ్ముకున్న కేసీఆర్ వ్యతిరేక అస్త్రం అంతగా పనిచేయడంలేదు. జనాల్లో పెద్దగా స్పందన వ్యక్తంకావడంలేదు. పైగా ఏపీ రాజకీయాలకు, తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టంచేశారు. మరోవైపు ఏపీవాసులు చాలామంది హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.

కేసీఆర్ ఆంధ్రావాళ్లకు వ్యతిరేకి అన్న భావన వారిలో ఎక్కడా లేదు. ఏపీ వాసులు చంద్రబాబు వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం అదే. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి, తన వ్యూహాన్ని మార్చుకుంటారో లేక ఇదే ఒరవడిని కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...