Switch to English

సినీ ప్రముఖులకు తాకిన అమరావతి రాజధాని సెగ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి, అలాగే సినిమా షూటింగ్స్ పునరుద్ధరణ గురించి చర్చిండం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచీ ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్లకార్డులతో రాజధాని అమరావతికి మద్దతు తెలపాలని గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి నిరసనలు తెలిపారు.దీంతో పోలీసు అధికారులు నిరసనకారులను, రైతులను అడ్డుకున్నారు.

అక్కడ ఉన్న రైతులు ఇలా స్పందించారు..

మేము సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టడానికి కానీ, దాడి చేయడానికి కానీ రాలేదు. గత 175రోజుల నుంచి మేము రాజధాని కోసం ఉద్యమం చేస్తున్నాం కానీ ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. ఇప్పుడు సినీ తారలు వచ్చారు, వారు మద్దతిస్తే మా ఉద్యమానికి సాయపడుతుందని ఇక్కడికి వచ్చాం. కానీ మమ్మల్ని ఆపేయడమే కాకుండా, అరెస్ట్ చేయడం ఎంత వరకూ కరెక్ట్ – ఓ మహిళ

మేము రాజధాని కోసం మా పొలాలు ఇచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే రాజధాని అమరావతికి సపోర్ట్ చేసి మాకు మద్దతు ఇవ్వండి, సంఘీభావం తెలపండి అని అడగటానికే ఇక్కడికి వచ్చాము తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇన్నాళ్లు వాళ్ళు ఎన్నో సినిమాలు రైతుల మీద తీశారు. మేము ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ఏ సినీ తార సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మేము కోరేది ఒకటే మాకు మద్దతు తెలపండి – ఓ మహిళ

కరోనా టైం కరోనా టైం అంటున్నారు.. ఏమండీ సినీ తారలకు కరోనా ఆంక్షలు లేవా.. వాళ్ళు మాత్రం వాళ్ళ బాగోగుల కోసం ఇక్కడికి వచ్చి అన్ని సెట్ చేసుకోవచ్చు. వారికి జగన్ గారు టైం ఇస్తారు. కానీ ఇక్కడే రైతులు రోజులు ఉద్యమం చేస్తున్నా, మా ముందు నుంచే ఆయన కారులో వెళ్తూ మమల్ని పట్టించుకోకపోగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము భౌతిక దూరం పాటిస్తూనే కనీసం సినీ వర్గాల మద్దతు అయినా లభిస్తుందని ఇక్కడి వచ్చాం – ఓ మహిళ

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....