Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: అలీ ఔట్‌, ఇంతేనా.. ఇందుకేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

సినిమాకి 50 రోజుల ఫంక్షన్‌ చేసినట్లు.. బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో 50 రోజుల పండగ నిర్వహించారు. ఆ పండక్కి నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తన సినిమా ‘గ్యాంగ్‌ లీడర్‌’ని ప్రమోట్‌ చేసుకోవడమే కాదు, వీకెండ్‌ ఎపిసోడ్‌కి తనదైన ‘నేచురల్‌’ లుక్‌ తెచ్చేందుకు ప్రయత్నించాడు.

షరామామూలుగానే హోస్ట్‌ నాగార్జున, ‘గోల్డ్‌’ నానిని డామినేట్‌ చేసెయ్యడానికి ప్రయత్నించాడు. లేకపోతే, నాగార్జున చేతి మీదకొచ్చిన కొత్త టాట్టూ గురించిన డిస్కషన్‌ బిగ్‌ హౌస్‌లో ఏంటి.? ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. దాన్నొక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మలచే ప్రయత్నమైతే చేశారుగానీ, ఎందుకో అది అంతగా అతకలేదన్నది మెజార్టీ అభిప్రాయం.

మరోపక్క నేచురల్‌ స్టార్‌ నాని, ‘నా..నీ.. టీవీలోకి..’ అనగానే, ఒక్కసారిగా విపరీతమైన ఊపు వచ్చేసింది. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నాని ఒక్కసారిగా హై ఓల్టేజ్‌ ఎనర్జీని తీసుకొచ్చేశాడు మూడో సీజన్‌కి. కంటెస్టెంట్స్‌ గురించి తనదైన స్టయిల్లో కామెంట్లు వేస్తూ నవ్వించాడు.. అఫ్‌కోర్స్‌ నాని మార్క్‌ ‘పెప్‌’ కంటెస్టెంట్స్‌కి డిఫరెంట్‌ ఫీలింగ్స్‌ ఇచ్చాయనుకోండి.. అది వేరే విషయం.

Also Read: బిగ్‌ షాక్‌: పునర్నవికి ‘ఐ లవ్‌ యూ’ చెప్పేశాడుగానీ.!

50 రోజుల జర్నీ గురించిన హంగామా తప్ప, ఇంకో అదనపు ఆకర్షణ లేకుండా పోయింది వీకెండ్‌ షోలో. ఎలిమినేషన్‌ ప్రాసెక్‌కి సంబంధించి ముందు లీక్‌ అయినట్లే జరిగిందంతా. నిన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ సేఫ్‌ అయితే, ఈ రోజు తొలుత శ్రీముఖి సేఫ్‌ జోన్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ఎలిమినేషన్‌లో అలీ రెజా ఔట్‌ అయిపోయాడు. హౌస్‌మేట్స్‌ విపరీతమైన షాక్‌కి గురయ్యారు.

ఇప్పటిదాకా తొలిసారిగా నామినేట్‌ అయినవారంతా బయటకు వెళ్ళిపోతున్నారని, తాను కూడా అలాగే బయటకు వచ్చేశాననీ, ఈ ట్రెండ్‌ ఇక్కడితో ఆగిపోతుందనీ అలీ రెజా సెలవిచ్చాడు. 50 రోజులు పూర్తయ్యాక తాను హౌస్‌ నుంచి బయటకు వచ్చాననీ, అంటే సగం బిగ్‌బాస్‌కి తానే విన్నర్‌ననీ అలీ చెప్పుకున్నాడు. హౌస్‌లో అలీ జర్నీ వీడియో ప్లే అవుతున్నప్పుడు, తన మీద నామినేషన్‌ సందర్భంగానో, ఇతర సందర్భాల్లోనో కంటెస్టెంట్స్‌ చేసిన నెగెటివ్‌ కామెంట్స్‌ని అలీ అస్సలు టేకిటీజీగా తీసుకోలేకపోయాడు.

ఎలిమినేట్‌ అయ్యాక కూడా ఇదేం ఆటిట్యూడో ఏమో.! హౌస్‌లో నేను లేను కదా.. ఇకపై టాస్క్‌లు అన్నీ ప్రశాంతంగా అవుతాయి.. ఎవరికీ ఎలాంటి ప్రమాదాలూ వుండవని అలీ చెప్పాడంటేనే, హౌస్‌లో తాను వున్నన్నాళ్ళూ ఎంత ఎగ్రెసివ్‌గా అలీ ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఏదో ప్లాన్‌ చేసి, అలీని బయటకు లాగేసినట్లు (ఎలిమినేట్‌ చేసినట్లు) మొత్తం తతంగం అయిపోయింది. అలీ కోసమే 50 రోజుల ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారా.? అన్నట్లు కూడా జరిగిందంతా.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...