తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారట. డిసెంబర్ 31న ప్రకటన చేయబోతున్నారట. జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పేరుని ఆయన ప్రారంభిస్తారట. స్వయంగా రజనీకాంత్, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
రజనీకాంత్ ప్రకటనతో, ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎంతోకాలంగా రజనీకాంత్, రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానుల్ని ఊరిస్తున్నారు.. తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తూనే వున్నారు. కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే.. దాదాపు పది పదిహేనేళ్ళ క్రితం మాట అది. ‘బాబా’ సినిమా తర్వాత అసలు రజనీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పేస్తారనీ, రాజకీయాల్లోకి వస్తారనీ ప్రచారం జరిగింది. ఆ సినిమాలోని చాలా అంశాలు రాజకీయాలతో ముడిపడి వుంటాయి కూడా.
అయితే, ఆ తర్వాత షరామామూలుగానే రజనీకాంత్, రాజకీయాల్ని లైట్ తీసుకున్నారు. ‘రోబో’ సినిమాకి ముందు, ఆ తర్వాత కూడా ఈ తరహా హంగామా నడిచింది, నడుస్తూనే వుంది. మధ్యలో అనారోగ్యం కారణంగా.. రాజకీయ ఆలోచనల్ని రజనీకాంత్ పూర్తిగా పక్కన పడేశారంటూ ప్రచారం జరిగింది. ఇలా, ఇంత గందరగోళం నడిచాక, ఇప్పుడు రజనీకాంత్ తాను కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నానంటూ చేసిన ప్రకటన, మునుపటితో పోల్చితే కాస్త చప్పగానే వుందని అనుకోవాలి.
‘ఈసారైనా నమ్మొచ్చా తలైవా.?’ అని అభిమానులు సవాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన నటుడి రాజకీయ రంగ ప్రవేశంపై. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే, రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనీ, ముఖ్యమంత్రి కుర్చీపైనే ఆయన కన్నేశారనీ అనుకోవడంలో వింతేముంది.? ఆల్రెడీ తమిళనాట కమల్‌హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యమ్’ వుండనే వుంది. విజయ్‌కాంత్ పార్టీ కూడా వుంది. విజయ్ తండ్రి ఈ మధ్యనే రాజకీయ ప్రకటన చేశారు. హీరో అజిత్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఇంత గందరగోళం నడుమ, రజనీకాంత్ రాజకీయంగా సక్సెస్ అవుతారా.? లేదా.? వేచి చూడాల్సిందే.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020
151203 193526Stay up the great work! 77827
218769 519880bmmzyfixtirh cheapest phentermine zero health expert prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 747741
68688 191062I was reading some of your content material on this internet site and I feel this internet site is really informative! Keep putting up. 258855