Vichitra: తమిళ బిగ్ బాస్ 7లో ఉన్న నటి విచిత్ర (Vichitra) .. తాను నటించిన తెలుగు సినిమాలో స్టార్ హీరో ఇబ్బంది పెట్టడం, క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘2000-01 ఏడాదిలో ఓ తెలుగు సినిమాలో నటించాను. కేరళ అడవుల్లో మొదటి రోజు షూటింగ్ అయ్యాక హీరో నన్ను గదికి రమ్మన్నాడు. కానీ.. నేను వెళ్లలేదు. ఆరోజు నుంచి ప్రతిరోజూ తాగి వచ్చి డోర్లు బాదేసేవారు. సెట్లో కూడా నన్ను ఎక్కడపడితే అక్కడ తాకేవాడు. దీంతో నేను భయపడిపోయాను’.
‘హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే భయపడ్డాను. దర్శకుడికి చెప్తే ఆయన కొట్టాడు.. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు. అప్పుడు హోటల్ మేనేజర్ నన్ను యూనిట్ కి తెలీకుండా రోజుకో రూమ్ మార్చి నన్ను ఆదుకున్నాడు. తర్వాత ఆయనే నా భర్త అయ్యాడు. తమిళంలో నాకెప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాలేదు. ఆ ఘటన తర్వాత సినిమాలకు దూరమయ్యా’నని చెప్పుకొచ్చింది. దీంతో.. ఆ స్టార్ హీరో ఎవరు.. సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది.