విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఖుషి’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత ఈ సినిమాలో హీరోయిన్. అంతకు ముందు సమంతకీ, విజయ్ దేవరకొండకీ.. విడివిడిగా ‘శాకుంతలం’, ‘లైగర్’ డిజాస్టర్లున్నాయ్. దాంతో, ‘ఖుషి’ సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్.. అయినాగానీ, తొలి మూడు రోజులు వచ్చిన మంచి వసూళ్ళతో, అటు సమంత.. ఇటు విజయ్ దేవరకొండకి ఊరట కలిగింది.
ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్ రియాల్టీ షో’ వేదికపైనా చెప్పాడు.. అదీ హోస్ట్ అక్కినేని నాగార్జునతో. ‘సంబరాలు చేసుకోవడంలేదు.. హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నాను..’ అని అన్నాడు విజయ్ దేవరకొండ. ఆ ఆనందంలోనే, తాజాగా కోటి రూపాయల మొత్తాన్ని వంద కుటుంబాలకు లక్ష చొప్పున అందిస్తానని ప్రకటించేశాడు. అభిమానుల సమక్షంలో ఈ ప్రకటన వచ్చింది.
దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కూడా.! ఓ హీరో ఇలా, ఓ సినిమా వేదిక మీద నుంచి.. ఇలా ఇంత మందికి సాయం ప్రకటించడం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి అనుకోవచ్చేమో. నిజానికి, మంచి ఆలోచనే ఇది. సాయం ఎవరు చేస్తామని ముందుకొచ్చినా అభినందించి తీరాలి కదా.!
కానీ, అభిషేక్ పిక్చర్స్ స్పందన వేరేలా వుంది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకిగాను 8 కోట్లు నష్టం వచ్చిందనీ, ఆ నష్టాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకోవాలని కోరుతూ ట్వీటేసింది అభిషేక్ పిక్చర్స్.!
రాంగ్ టైమింగ్.! మామూలు రాంగ్ టైమ్ కాదు.. అత్యంత దారుణమైన టైమింగ్ ఇది.! సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వస్తే.. అడగాల్సింది నిర్మాణ సంస్థని కదా.? తన సంపాదన లోంచి, సామాజిక బాధ్యతగా ఓ కోటి రూపాయల్ని, వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలనుకోవడం విజయ్ దేవరకొండ చేసిన మంచి పని.. అది చెడ్డ పని కాదు.!
మంచి పని చేస్తున్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని కిందికి లాగెయ్యాలని చూడటమేంటో.! నష్టపోయారు.. నిజం. కానీ, అడిగే పద్ధతి ఇదా.? ఒకవేళ లాభాలు వస్తే, హీరోకి పంచుతారా.? ఛాన్సే లేదు కదా.! సినిమా అనేది రిస్కీ వ్యాపారం. నటీనటులు, దర్శక నిర్మాతలు.. అందరూ రిస్క్ చేయాల్సిందే.!
ఫ్లాప్ సినిమా చేయాలని ఎవరూ అనుకోరు. కొన్నిసార్లు ఫ్లాపులొస్తాయ్. సినిమాపై అంచనాలతో, డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయి, బొక్క బోర్లా పడిపోతుంటారు. ఒక్కోసారి తక్కువ రేట్లకు కొని, ఎక్కువ లాభాలు పొందుతారు. లాభాల్ని పంచనప్పుడు, నష్టాలపై నిలదీయడం ఎంతవరకు సబబు.? అదీ హీరోని నిలదీయడమేంటో.?
అభిషేక్ పిక్చర్స్ లాంటి సంస్థ నుంచి ఇలాంటి ట్వీట్.. ఏంటీ అని పరిశ్రమలో అంతా ఇప్పుడు ఈ వ్యవహారంపైనే చర్చించుకుంటున్నారు.. అభిషేక్ పిక్చర్స్ మీద కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు కూడా.!
As the admin of this web site is working, no uncertainty very soon it will be renowned, due to its feature contents.
Your way of telling the whole thing in this paragraph is in fact fastidious, all be capable
of easily be aware of it, Thanks a lot.
I think this is one of the most important info for me.
And i am glad reading your article. But want to remark on few general things, The website style is wonderful, the articles
is really excellent : D. Good job, cheers
What’s Taking place i’m new to this, I stumbled upon this I have discovered It
absolutely helpful and it has helped me out loads. I hope
to give a contribution & aid other customers like its helped me.
Great job.