Switch to English

పవన్ కళ్యాణ్‌ది సొల్లు పురాణమైతే.. బులుగు సొల్లు సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది సొల్లు పురాణమంటూ బులుగు మీడియా మొరుగుతోంది. ‘నేను మీకు భరోసా ఇస్తున్నా.. మీ పార్టీ అధినేత భార్య సహా.. వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఇంట్లోని మహిళలెవర్నీ నేనుగానీ, నా పార్టీ కార్యకర్తలుగానీ, నా అభిమానులుగానీ తిట్టరు.. అలాగని నా పార్టీ కార్యకర్తలకు, అభిమనులకూ స్పష్టమైన ఆదేశాలిస్తున్నా..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడం సొల్లు పురాణమైపోయింది.

ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా ఇలా చెప్పగలడా.? అయినా, పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తప్పులు, సొల్లు అనేంతగా అర్థం పర్థం లేని విషయాలు బులుగు మీడియాకి ఏం కనిపించాయబ్బా.? వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు చంద్రబాబే కారణమని స్వయంగా వైఎస్ జగన్ ఆరోపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి. సో, చంద్రబాబుని తీసుకెళ్ళి లోపలెయ్యొచ్చు కదా.? అలా ఎందుకు చెయ్యడంలేదని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణమెలా అవుతుంది.?

ఓ సామాజిక వర్గానికి మాత్రమే అధికారమా.? ఓ సామాజిక వర్గానికి మాత్రమే కీలక పదవుల్లో ప్రాధాన్యతా.? అని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణమా.? అవును మరి, ఆ సామాజిక వర్గానికి చెందడం వల్లనే బులుగు మీడియాలో చాలావరకు ‘అవకాశాలు’ ప్రభుత్వం నుంచి పొందుతున్నారు మరి. సో, వాళ్ళకి పవన్ సంధించే ప్రతి ప్రశ్నా సొల్లు పురాణంలానే కనిపిస్తుంది.

దేవాలయాల మీద దాడులు జరగడం అత్యంత హేయం.. దీన్ని ప్రశ్నిస్తే సొల్లు పురాణమని అంటున్న బులుగు మీడియాకి అసలు సెక్యులరిజం అంటే ఏంటో తెలుసో లేదో మరి.! సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో వున్నాయ్.? టిక్కెట్ల ధరలు మీరెంత నిర్ణయించుకున్నా నాకేంటి నష్టం.? అని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణంలా కనిపించింది బులుగు మీడియాకి. నిజమే కదా, రాష్ట్రంలో సినిమా థియేటర్లు చాలావరకు ఎవరి అదుపాజ్ఞల్లో వున్నాయో అందరికీ తెలుసు.. కానీ, కుక్కిన పేనుల్లా మూసుక్కూర్చున్నారు తప్ప, నిజాలు మాట్లాడే పరిస్థితే లేదు.

అయినా, పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేయడమెందుకు.? అధికారంలో వున్నారు కదా.. ఏ విచారణ చేస్తారో చేసేసి, పవన్ కళ్యాణ్ ఫలానా మొత్తం ప్యాకేజీ తీసుకున్నారని కోర్టుల ద్వారా నిరూపించెయ్యొచ్చు. అది చేతకానివాళ్ళే సొల్లుపురాణం చెబుతారు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి. ఇంకా పెద్ద సొల్లు పురాణమేంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి భారంగా మారారట. అలాగైతే, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలెందుకు పోటీపడుతున్నట్టు.?

ఓ మనిషి పొద్దున్న లేస్తే వాడే టూత్ పేస్టు నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు టీవీ చూసేవరకూ పన్నులు కడుతున్నాడు, అలా నిండే ఖజానా నుంచి కొందరికి ఓటు బ్యాంకు పథకాలు అందిస్తూ, సొంత పేర్లతో ప్రచారం చేసుకుంటున్నారెందుకు.? అని పవన్ ప్రశ్నించాడు. ఆ సొమ్ముల్ని అడ్డంగా బొక్కేసేవారికి పవన్ కళ్యాణ్ విమర్శలు సొల్లు పురాణంలానే కనిపిస్తాయ్.

పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.. కానీ, 150 మందికి పైగా ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల్ని గెలుచుకున్న అధికార పార్టీ, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తే.. అది సొల్లు పురాణమట. ఔను, మోచేతి నీళ్ళు తాగడం అలవాటైపోయినోళ్ళకి.. ‘ప్రశ్నించే తత్వం’ తొందరగా మింగుడుపడదు. అందుకే, తమ ‘సొల్లు’ని తమకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేస్తుంటారంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...