Switch to English

ఆర్జీవీ పంచ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాలు తీయడమెప్పుడో మర్చిపోయిన ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలన ‘పిట్ట’, అదేనండీ ట్విట్టర్‌ పిట్టగా మారిపోయిన సంగతి తెల్సిందే. ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తానని అనౌన్స్‌ చేస్తే జనం తనను గట్టిగా పట్టించుకుంటారు? అన్న కోణంలో మాత్రమే ఆలోచిస్తోన్న వర్మ, కుప్పలు తెప్పలుగా టైటిల్స్‌ ప్రకటించేస్తున్నాడు, వాటిని తన ‘పబ్లిసిటీ అవసరం’ తీరిపోగానే, కాలగర్భంలో కలిపేస్తున్నాడు.

మొన్న కేసీఆర్‌ జీవిత చరిత్ర ‘టైగర్‌ కేసీఆర్‌’ అన్నాడు, నిన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ ప్రకటించి నికృష్ట కుల రాజకీయాలకు తెరలేపాడు. జయలలిత బయోపిక్‌ ఏమయ్యింది.? అంతకు ముందు ప్రకటించిన చాలా సినిమాలేమయ్యాయి.? అనడిగితే, అంతా ‘నా ఇష్టం’ అంటాడు వర్మ, అంతకు మించి ఇంకో సమాధానం అతని దగ్గర వుండదు కదా. ఇక, ఇప్పుడు వర్మ, పవన్‌ కళ్యాణ్‌ మీద సెటైర్‌ వేసేశాడు. తనను ఓడించేందుకు ప్రత్యర్థులు 150 కోట్లు ఖర్చు చేశారని పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ విమర్శ చేయగానే, రామ్‌గోపాల్‌ వర్మకి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది.

అసలు, ప్రజాస్వామ్యం.. ప్రజా సేవ వంటి అంశాలు తనకు తెలియనే తెలియవని చెప్పే వర్మకి పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు గట్టిగా తగలడమేంటో. బహుశా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నట్టున్నారు. చంద్రబాబునో, వైఎస్‌ జగన్‌నో పవన్‌ పరోక్షంగా విమర్శిస్తే, రామ్‌గోపాల్‌ వర్మకి కోపం రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలి ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై ప్రవహించింది. మరీ ముఖ్యంగా, భీమవరంతోపాటు గాజువాక నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు, నడిపిన వ్యవహారాలకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా చాలా వీడియోలు దర్శనమిచ్చాయి. అప్పుడు పెగలని నోరు, ఇప్పుడు పెగలడమేంటి వర్మగారూ? అని జనం ప్రశ్నిస్తున్నారు.

అఫ్‌కోర్స్‌, ఆయనగారు ప్రశ్నిస్తాడు తప్ప ఎవరి ప్రశ్నలకూ సమాధానమిచ్చే ధైర్యం లేని సంచలన ట్విట్టర్‌ పిట్టని ఎవరైనా ప్రశ్నించడం దండగ అనుకోండి. అది వేరే సంగతి. అయినా, పబ్లిసిటీ కోసం ఆ పార్టీ పంచనా, ఈ పార్టీ పంచనా చేరి ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని చెప్పుకునే రామ్‌గోపాల్‌ వర్మ, సోషల్‌ మీడియాకెక్కి ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ అమాయకంగా ప్రశ్నిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మొన్నామధ్య ‘నాలాగా డైరెక్టుగా ఓపెన్‌గా మాట్లాడే ధైర్యం లేక..’ అంటూ ఎవర్నో ఉద్దేశించి వర్మ సెటైర్లు వేశాడు. ధైర్యమంటే, ఎవడో ఇచ్చిన డబ్బులతో వాడికి నచ్చినట్టు చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడమా? ఇదీ అసలు సిసలు జస్ట్‌ ఆస్కింగ్‌ అంటే. ధైర్యముంటే, ఇప్పుడు జగన్‌కి వ్యతిరేకంగా సినిమా తీయాలి. ఓపెన్‌గా మాట్లాడే దమ్ముంటే, తెలంగాణలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా నినదించాలి. ఇంకా నయ్యం, అంత సీనే వుంటే, ఆయన రామ్‌గోపాల్‌ వర్మ ఎందుకవుతాడు?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...