Switch to English

ఏపీ, తెలంగాణ నీళ్ళ ముచ్చట.. కేంద్రం చేతికి వెళ్ళిపోయిందహో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పిట్ట పోరు.. పిట్ట పోరు.. పిల్లి తీర్చిందన్నట్లు తయారైంది వ్యవహారం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ రెండు నిమిషాలు అలా సరదాగా కూర్చుని ఓ అవగాహనకి వచ్చి వుంటే, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు పరిష్కారం లభించేదే.

కర్నాటకతో తెలంగాణ ప్రభుత్వం మంతనాలు జరిపింది.. మహారాష్ట్రతోనూ మంతనాలు జరిపింది.. ఆయా రాష్ట్రాలతో నీటి వివాదాల్లేకుండా చేసుకుంది. మరి, ఆంధ్రపదేశ్‌తో మాత్రం తెలంగాణ ప్రభుత్వమెందుకు పంచాయితీని సరిచేసుకోలేకపోయింది.? ఆంధ్రపదేశ్ ఎందుకు తెలంగాణతో జల వివాదాన్ని పరిష్కరించుకోలేకపోయింది.? ఎందుకంటే, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు సెంటిమెంటు రాజకీయాలు అవసరం. సమస్య పరిష్కారమైపోతే ప్రజలు సుఖపడిపోతారు కదా.? అలా ప్రజలు సుఖపడిపోతే, వీళ్ళిక రాజకీయం చేయడానికేమీ వుండదు. ఈ ముక్క ప్రజలకు అర్థం కాకుండా చేయడమే ప్రధాన రాజకీయ పార్టీ లక్ష్యం.

ఇప్పుడేమయ్యింది.? తెలుగు రాష్ట్రాల్లోని నీటి పంచాయితీ.. కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. రివర్ బోర్డుల మేనేజ్మెంట్ నోటిఫై అయ్యింది. ఇక, ఇప్పుడు ఏ వివాదమైనా ఆ బోర్డులోనే పరిష్కరించుకోవాలి. ఆ బోర్డులు ఎలా చెబితే అలా రెండు తెలుగు రాష్ట్రాలూ నడచుకోవాల్సిందే. చరిత్రలోకి తొంగి చూస్తే, తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడూ సమ అన్యాయమే కేంద్రం నుంచి జరుగుతూ వస్తోంది తప్ప, సమన్యాయం జరిగిన దాఖలాల్లేవ్.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనే ఇందుకు నిదర్శనం. ఏడేళ్ళ క్రితం ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతే.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు చాలావరకు అలాగే వున్నాయ్. పరిష్కరించాల్సిన కేంద్రం, చోద్యం చూస్తూ వచ్చింది. జల వివాదం – బోర్డుల వ్యవహారం విషయానికొస్తే, కేంద్రం చాలా తెలివిగా వ్యవహరించింది. మొత్తం అధికారాల్ని బోర్డుకే కట్టబెడుతున్నట్లు గెజిట్ జారీ అయ్యింది. అంటే, కేంద్రాన్ని నిలదీయడానికీ వీల్లేదన్నమాట.

బోర్డు మీద తెరవెనుకాల పెత్తనమంతా కేంద్రానిదే. జీఎస్టీ విషయంలో ఎలాగైతే, ‘మాకేం సంబంధం లేదు.. జీఎస్టీ మండలిలో అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి..’ అని కేంద్రం చేతులెత్తేస్తోందో.. రేప్పొద్దున్న నీటి బోర్డుల విషయంలోనూ అంతే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...