Switch to English

బాలయ్య బ్లడ్డు, బ్రీడు వేరు.. ఆయనే రాసుకుపూసుకు తిరగాలె.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తాను చేస్తేనే సంసారం.. ఇంకెవడన్నా చేస్తే అది వ్యభిచారం అన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు ఈ ప్రస్తావనని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విషయంలో తెస్తున్నారు చాలామంది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు కదా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఎకరం భూమిని ప్రభుత్వం నుంచి సంపాదించలేకపోయారా.? అంటూ ఎద్దేవా చేసేశారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున నిధుల వేట కోసం విదేశాలకు ‘క్లాస్’ టిక్కట్లలో వెళ్లొచ్చారు కదా.? ఆ నిధులు ఏమయ్యాయ్.? అని కూడా బాలయ్య నిలదీసేశారు. నిజానికి, బాలయ్య లేస్తే మనిషి కారు.. లేవరంతే. మెగా క్యాంప్ మీద పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బాలయ్య విమర్శలు చేయడం కొత్త విషయం కాదు.

‘బాలయ్య చిన్న పిల్లాడు.. ఆయన మాటల్ని పట్టించుకోవద్దు..’ అని చిరంజీవి ఓ సందర్భంలో లైట్ తీసుకున్నారు. ఓ సారి చిరంజీవి తనకు సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితుడైన మిత్రుడని బాలయ్యే అంటాడు.. అదే బాలయ్య, ‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు..’ అంటారు. అందుకేనేమో, చిరంజీవి.. బాలయ్యను లైట్ తీసుకుంటారు.

ఇక, ‘మా’ వివాదం విషయానికొస్తే, మంచు విష్ణుకి బాలయ్య మద్దతు తెలిపిన విషయం విదితమే. అదే సమయంలో, లోకల్ నాన్ లోకల్ వివాదంలో ప్రకాష్ రాజ్‌కి బాలయ్య మద్దతు పలికినట్లయ్యింది. వెయ్యి మంది సభ్యులు కూడా లేని అసోసియేషన్ వ్యవహారంలో ఇంత రాజకీయం అవసరమా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరోపక్క, కోటానుకోట్లు సంపాదించే సినీ ప్రముఖులు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఓ భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారన్నది ఇంకో ప్రశ్న. చిరంజీవి, నాగార్జున మాత్రమే కాదు, బాలయ్య కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో రాసుకుపూసుకు తిరిగారు. మరి, ఆయనైనా ఓ ఎకరం భూమిని అసోసియేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి రప్పించలేకపోయారంటే, దానర్థమేంటి.?

పైగా, 2014 నుంచి 2019 వరకు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో టీడీపీనే అధికారంలో వుంది. అప్పుడూ ఆయన ఎమ్మెల్యేనే. ఆ కోణంలో అయినా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన రిక్వెస్ట్ చేసి వుండాల్సింది. అందరూ మాటలే చెబుతారు.. పనిదగ్గరకు వచ్చేసరికి, ‘ఇది చాలా చిన్న విషయం. మాది చాలా పెద్ద రేంజ్..’ అంటుంటారు. అసోసియేషన్ భవనం కోసం డబ్బులిచ్చేస్తామని ఇప్పుడు చాలామంది చెబుతున్నారు.. ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేకపోయారో ఏమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...