జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏం సాధిస్తాడు.? అనే ప్రశ్న కంటే, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడిస్తాడు.? అనే ప్రశ్నకే క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాలు మానేయద్దనీ, వీలైనంత త్వరగా ఓ సినిమా చేయాలనీ, మెజార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకూ సినిమాల్లో రీ ఎంట్రీ గురించి పెదవి విప్పలేదు. తన జీవితం రాజకీయాలకే అంకితం అని ఒకటికి పది సార్లు చెప్పారు కనుక దాన్ని కాదని అభిమానులు ఎవరూ ఇంకో ఆలోచన చేయలేకపోతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ గురించి ఎప్పటికప్పుడు సరికొత్తగా సినీ గాసిప్స్ ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రచారంలో ఏది నిజం.? అనేది మాత్రం ఎవరికీ తెలీదు.
ఇంకొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు షురూ అవుతాయి. ఆ ఫలితాల తర్వాత జనసేనాని భవిష్యత్ కార్యచరణపై ఓ క్లారిటీ వస్తుందని చాలా మంది భావిస్తున్నారట. ఇదిలా ఉంటే, ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ని కలిశాడనీ, సినీ విశేషాలు చర్చించాడనీ గుసగుసలు వినిపిస్తే, సింపుల్‌గా ఆ గాసిప్స్‌ని కొట్టి పాడేశాడు హరీష్. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడు.? అని చెప్పేయలేం.. హరీష్ – పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ లేదనీ అనలేం. ఇదిలా ఉంటే, ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రం పవన్ కళ్యాణ్‌తో ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల తరపున ఆ ఇద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ఒకటి మైత్రీ మూవీస్ బ్యానర్ కాగా, ఇంకొకటి సితార ఎంటర్టైన్మెంట్స్. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్‌తో ఈ రెండు బ్యానర్లకు సంబంధించిన ముఖ్యులు విడివిడిగా పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపారనీ, మళ్లీ సినిమాల్లో కొనసాగడమంటూ జరిగితే, ఖచ్చితంగా మీతో సినిమాలు చేస్తానని పవన్ మాటిచ్చాడంటూ తాజా ఖబర్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు బ్యానర్లలో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఇద్దరు దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారట. అందులో ఒకరు పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. పవన్ కళ్యాణ్‌తో ఆల్రెడీ హిట్ కొట్టాడు. ఇంకో దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్‌కి బీభత్సమైన ఆప్తుడట.
జూన్ తొలి వారంలో సినీ కెరీర్‌పై స్పష్టత వస్తుందనీ, అది కూడా పోజిటివ్గానే ఉంటుందనీ తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలు కూడా పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తే, అది పార్టీకి అదనపు బోనస్ అవుతుందని సూచించడంతో నో చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రత్యేకమైన కారణాలేమీ లేనట్టే.
444065 940406Theres noticeably a bundle to find out about this. I assume you created certain very good points in functions also. 638835
922748 911370Oh my goodness! an amazing post dude. Thank you Even so My business is experiencing issue with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss dilemma? Anybody who knows kindly respond. Thnkx 929596
471281 874643hi, your site is amazing. I truly do numerous thanks for operate 212096
481180 893672Hello! Amazing post! Please when I could see a follow up! 375273
6538 744268How much of an exciting piece of writing, continue creating companion 989698
116825 537174Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past few posts are just just a little out of track! 686117