Switch to English

సుమంత్ ‘కపటధారి’ మూవీ రివ్యూ: థ్రిల్స్ ఓకే, కానీ ఎమోషనల్ కనెక్ట్ మిస్సింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘మళ్ళీ రావా’, ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలతో హిట్స్ అందుకున్న అక్కినేని హీరో సుమంత్ చేసిన కాప్ థ్రిల్లర్ ‘కపటధారి’. 2019 సమ్మర్లో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన కన్నడ ఫిల్మ్ ‘కవలుధారి’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ వెర్షన్ జనవరి 28న రిలీజై హిట్ గా నిలిచింది. మరి రెండు భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా హిట్ అయ్యి సుమంత్ కి మరో హిట్ ఇచ్చిందేమో చూద్దాం..

కథ:

హీరో గౌతమ్(సుమంత్) ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్, కానీ తనకి ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ చెయ్యడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే గౌతమ్ కి మొదటి నుంచీ క్రైమ్ కేసులు సాల్వ్ చెయ్యాలని ఉంటుంది. ఎన్ని సార్లు తన పై ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నా ఫలితం ఉండదు. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాల్లో ఓ ముగ్గురికి సంబందించిన స్కెలిటన్స్ దొరుకుతాయి. ఆ కేసు గౌతమ్ కి చాలా ఆసక్తిగా అనిపించి కమీషనర్ ని ఆ కేసులో వేయమని రిక్వెస్ట్ చేసినా పనవ్వదు. దాంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడ్తాడు. ఆ టైంలో అదే కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్ట్ కుమార్(జయప్రకాశ్) రాగానే కొన్ని క్లూస్ దొరుకుతాయి. అప్పుడే కథలోకి దాదాపు 40 ఏళ్ళ క్రితం ఆ కేసు డీల్ చేసిన రంజన్(నాజర్) ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి కథ ఎన్నెన్ని మలుపులు తిరిగింది.? ఆ కేసుని గౌతమ్ ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎవరెవరు అడ్డుపడ్డారు? అలా అడ్డుపడిన వారిని గౌతమ్ ఎలా ఎదుర్కున్నాడు? చివరికి గౌతమ్ ట్రాఫిక్ లోనే ఉండిపోయాడా లేక కేసు సాల్వ్ చేసి క్రైమ్ డిపార్ట్ మెంట్ కి షిఫ్ట్ అయ్యాడా.? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

సుమంత్ మరోసారి తనకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా చేసాడు. కానీ ఆ పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ టచ్ ఉండి ఉంటే బాగుండేది. ఈ సినిమాకి నటుల పరంగా ప్రధాన బలం అంటే నాజర్. రంజిత్ పాత్రలో, రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించి పాత్రకి ప్రాణం పోశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్రలో కనిపించింది జయప్రకాశ్. తన పాత్రకి న్యాయం చేసాడు. వెన్నెల కిషోర్ ఉన్న రెండు మూడు సీన్స్ లో వన్ లైనర్స్ నవ్విస్తాయి, స్పెషల్ గా అడవి శేష్ మీద వేసిన పంచ్ బాగా పేలింది. హీరోయిన్ అని చెప్పిన నందిత శ్వేతకి గెస్ట్ రోల్లో కనిపించిన సుమన్ రంగనాథన్ కన్నా తక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం షాకింగ్. కనపడిన సీన్స్ లో నాలుగు మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఇక విలన్ గా చేసిన సతీష్ కుమార్ బాగా చేసాడు. ఓవరాల్ గా ఆన్ స్క్రీన్ మీద కనపడ్డ అందరూ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం వలనే అక్కడక్కడా బోర్ కొడుతున్నా చూడగలం.

తెర వెనుక టాలెంట్..

కపటధారి ఒక రీమేక్ సినిమా.. కావున దాదాపు అన్నీ ఒరిజినల్ వెర్షన్ నుంచి యాజిటీజ్ గా ఫాలో అయ్యారు. ముందుగా రసమతి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ని క్రియేట్ చేసేలా చూసుకున్నాడు. అలాగే కలరింగ్ తో ఒక కొత్త లుక్ లో విజువల్స్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సిమోన్ కె కింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి చోటా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ కి సినిమాపై ఆసక్తిని కలిగించాడు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. చూసింది 2 గంటల 18 నిమిషాలే అయినా చాలా ఎక్కువసేపు చూసేసిన ఫీలింగ్ వస్తుంది. విదేష్ ఆర్ట్ వర్క్ వల్ల సినిమాలో మూడ్ ఎక్కడా మిస్ అవ్వదు.

ఇక ఒరిజినల్ వెర్షన్ కి కథ అందించిన హేమంత్ ఎం రావు కథ పరవాలేధనిపిస్తుంది. కథనంలో కొన్ని థ్రిల్స్ ని పక్కనపెడితే, కథ, మరియు అలాంటి క్రైమ్ తరహా సినిమాలు మనం చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. కథనంలో సెకండాఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్స్ బాగానే అనిపించినా చివరికి మళ్ళీ రొటీన్ పంథాలో కథని ముగించడం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి టెక్నికల్ గా ఒక థ్రిల్లర్ కి కావాల్సిన ఫీల్ ని అయితే క్రియేట్ చేయగలిగాడు కానీ ఎమోషనల్ గా కథని కనెక్ట్ చేయలేకపోయాడు. కథలో ఎదో ఒక పాత్రకి లేదా ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ కావాలి అప్పుడే ఆ థ్రిల్స్ వావ్ అనిపిస్తాయి. కానీ ఏ పాత్రతోనూ ఆడియన్ కనెక్ట్ అవ్వడు దాంతో సినిమా చాలా నీరసంగా సాగుతున్నట్టు ఉంటుంది. వచ్చిన థ్రిల్స్ సెకండాఫ్ లో డీసెంట్ అనిపిస్తాయి, కానీ ఆ థ్రిల్స్ రివీలింగ్ లో అంత పెద్ద ఇంపాక్ట్ కనిపించలేదు. లలిత ధనంజయన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నాజర్ ఎపిసోడ్స్
– ఇంటర్వల్ బ్లాక్
– సెకండాఫ్ లోని కొన్ని థ్రిల్స్
– విజువల్స్ అండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– పాత్రలతో కనెక్షన్ మిస్ అవ్వడం
– ఇంకా ఆసక్తిగా ఉండాల్సిన కథనం
– స్లో నేరేషన్
– ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
– రొటీన్ గా ఫినిష్క్చేసిన క్లైమాక్స్
– ఇలాంటి కథలు చూసాం కదా అనే ఫీలింగ్

విశ్లేషణ:

కన్నడ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా వచ్చిన కపటధారి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లాగే ఆర్ట్ వర్క్, విజువల్స్, మ్యూజిక్ ఇలాంటి టెక్నికల్ విషయాలను రీక్రియెట్ చేయగలిగారు కానీ కథ లోని ఎమోషనల్ టచ్ ని, కథనంతో చూసే ప్రేక్షకుణ్ణి హుక్ చేసే విషయంలో ఫెయిల్ అవ్వడం వలన ఈ కపటధారి ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.

చూడాలా? వద్దా?: సబ్ టైటిల్స్ తో ప్రైమ్ లో ఉన్న ఒరిజినల్ వెర్షన్ చూడడం బెటర్.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.25/5 

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....