Switch to English

టీడీపీ వర్సెస్‌ వైసీపీ: ఎన్నాళ్ళీ శవ రాజకీయాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,389FansLike
57,764FollowersFollow

కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌.. మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. రాయలసీమకి ఫ్యాక్షన్‌ రాజకీయ హత్యలు కొత్తేమీ కాదు. ఇది కూడా ఆ కోవలో జరిగిన హత్యగానే చూడాలేమో.!

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఈ హత్యకు కారకుడన్నది మృతుడి భార్య ఆరోపణ. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు కూడా. అయితే, పోలీసులు మాత్రం, ఎమ్మెల్యే పేరుని తెలివిగా ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా జాగ్రత్తపడ్డారన్న విమర్శలున్నాయి. నారా లోకేష్‌, బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో.. హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోతే, మృతదేహాన్ని అక్కడి నుంచి కదలనీయబోమంటూ అటు బాధిత కుటుంబం, ఇటు నారా లోకేష్‌ భీష్మించుక్కూర్చున్నారు.

పోలీసులు చేసేది లేక, బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినందున, కోర్టు అనుమతితో ఎమ్మెల్యే పేరుని నిందితుల లిస్ట్‌లో చేర్చుతామని హామీ ఇచ్చారట పోలీసులు. నిజానికి, వైసీపీ హయాంలో పోలీసులు ఆయా కేసుల విచారణకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడితే, ముందుగా కేసు నమోదు చేసింది బాధిత మాజీ ఎమ్మెల్యే మీద. ఆ తర్వాత బాధిత మాజీ ఎమ్మెల్యే తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాల్ని వీడియోల రూపంలో పంపించాక, పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాక, అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది అప్పటి ప్రతిపక్ష నేతకి. ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీకి, పోలీసుల మీద నమ్మకం లేకుండా చేస్తోంది వైసీపీ. పెద్దగా తేడా ఏం లేదు. ఇక, శవ రాజకీయాల విషయానికొస్తే, ఇలాంటివి చంద్రబాబు హయాంలో వైసీపీ చాలానే చేసింది. అంతిమంగా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతూనే వున్నాయి.. కింది స్థాయి నేతలు ఈ రాజకీయ పార్టీల్ని నమ్ముకుని ప్రాణాలు కోల్పోతున్నారంతే. ప్రొద్దుటూరు ఘటనలో మృతి చెందిన సుబ్బయ్య గతంలో వైసీపీ నేత కావడం గమనార్హం.

4 COMMENTS

  1. We invite you to engage, discuss, and share your thoughts with fellow knowledge seekers about Magic mushroom. By fostering an environment of collaborative learning and open dialogue, we believe that the appreciation for information grows exponentially. Our dedication to staying current ensures that we are always exposed to your latest insights, trends, and breakthroughs. From cutting-edge research to timeless classics, we curate content that spans the spectrum of human knowledge.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

మ‌న‌మే ప్రీ-రిలీజ్ ఈవెంట్.. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే జూన్ 7న రిలీజ్ కు రెడీ అయ్యింది. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌క‌క్కిస్తున్న...

రాజకీయం

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ తండ్రి పవన్ తోనే...

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు....

కూటమి విజయం… టాలీవుడ్ కష్టం తీరినట్టేనా!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంతేకాకుండా టాలీవుడ్ లోనూ కూటమి విజయాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత...

Pawan Kalyan: భార్య, కుమారుడితో మోదీని కలిసిన పవన్.. ఫొటో వైరల్

Pawan Kalyan: సినిమాల్లో తాను పవర్ స్టార్ అయితే.. రాజకీయాల్లో గేమ్ చేంజర్ అని యావత్ ప్రజానీకానికీ ఒక్క 2024 ఎన్నికల ఫలితాలతో నిరూపించేశారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఎన్నికల్లో కూటమి...

ఎక్కువ చదివినవి

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 05 జూన్ 2024

పంచాంగం తేదీ 05- 06-2024, బుధవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ చతుర్దశి రాత్రి 7:11 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం:...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏమైందో అర్థం కావడం లేదు.. సీఎం జగన్ భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సంక్షేమ పథకాలే తమకి మరోసారి అధికారం కట్టబెడతాయని ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో...

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...