Switch to English

రివ్యూ: మర్డర్ – నటీనటుల నటన హిట్, బోరింగ్ మెలో డ్రామా.!

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
Movie మర్డర్
Star Cast శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, సాహితీ, గిరిధ‌ర్‌, గాయ‌త్రి భార్గ‌వి
Director ఆనంద్ చంద్ర
Producer న‌ట్టి క‌రుణ‌, న‌ట్టి క్రాంతి
Music డి.ఎస్‌.ఆర్‌
Run Time 1 గంట 53 నిముషాలు
Release డిసెంబర్ 24, 2020

వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ టెక్నిషియన్ అనే స్థాయి నుంచి వివాదాలతో కాష్ చేసుకునే వ్యక్తి అనే స్థాయికి దిగజారిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన మరో రియల్ లైఫ్ స్టోరీ ‘మర్డర్’. మిర్యాలగూడాలో పరువు హత్య జరిగిన మారుతీ రావు కథ ఆధారంగా చేసిన సినిమానే ‘మర్డర్’. పలు వివాదాల తర్వాత అన్నీ క్లియర్ చేసుకొని నేడు థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

సమాజంలో డ‌బ్బు, పేరు, ప్ర‌తిష్ట, తమకంటూ ఓ ప్రత్యేక హోదా ఉన్న కుటుంబం మాధవరావు, వనజ (శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి)లది. వారి గారాల బిడ్డే నమ్రత (సాహితి). చిన్నప్పటి నుంచి మాధవరావు తన కూతురు అడిగింది కాదనకుండా అతి గారాబంగా పెంచుతాడు. మాధవరావు తన కూతురు సాహితీ జీవితాన్ని గొప్పగా ప్లాన్ చేస్తున్న సమయంలో సాహితి తను ప్రవీణ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పడం, దానికి మాధవరావు ఒప్పుకోకపోవడం, తండ్రిని కాదని సాహితి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత మాధవరావు ఎదురుకున్న పరిస్థితులు, తనలో తాను పడ్డ మనోవేదన మరియు ప్రేమ కోపంగా మారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? దాని వల్ల మాధవరావు కుటుంబం ఎలా చిన్నాభిన్నం అయ్యింది? మాధవరావు నిర్ణయం వలన సాహితి లైఫ్ ఏమయ్యింది అనేదే కథ.

తెర మీద స్టార్స్..

ఆర్జీవీ ఎన్ని రకాలుగా కాదని చెప్పినా మర్డర్ అనే సినిమా ప్రణయ్ పరువు హత్య ఆధారంగా తీసింది. కూతుర్ని అమితంగా ప్రేమించిన తండ్రి ఎలా అంత కఠినంగా బిహేవ్ చేయగలిగాడు అనేది అందరి మదిలోని ప్రశ్న. ఆ సమయంలో అతని ఎలాంటి భావోద్వేగానికి, మనోవేదనకి గురై ఉంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ శ్రీకాంత్ అయ్యంగార్ తన అద్భుతమైన నటనతో ప్రతి సన్నీ వేషాన్ని, ప్రతి చిన్న చిన్న ఎమోషన్స్ ని మన కళ్ళకు కట్టినట్లు చూపించాడు. చూసిన ప్రతి ఒక్కరూ వాహ్ ఏమన్నా చేశాడా.. నటించలేదు జీవించాడు అని కితాబులిస్తారు. అతని నటనకి అవార్డులు కూడా వరించవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్ కి పోటీగా సాహితి కూడా సూపర్బ్ నటనతో ఆడియాన్స్ ని కట్టి పడేసింది. సినిమాలో కథ అనేది అందరికీ తెలిసిందే కానీ వీరిద్దరి నటన వలన ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. గాయత్రీ భార్గవి, గిరిధర్ లు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా గాయత్రీ భార్గవి అయితే మొదటి సారి ఇలాంటి పాత్రలో పర్ఫెక్ట్ ఎమోషన్స్ తో అందరూ షాక్ అయ్యేలా చేసింది.

తెర వెనుక టాలెంట్..

తెర వెనుక కూడా మెచ్చుకోదగిన డిపార్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ముందుగా దర్శకుడు ఆనంద్ చంద్ర విషయానికి వస్తే.. ఆయన ఎంచుకున్న కథ అందరికీ తెలిసిందే.. ఇలాంటి కథలని చెప్పాలంటే అద్భుతమైన నటీనటులు కావాలి, అందులో సూపర్ సక్సెస్ అయ్యాడు.. ఇక ఈ కథకి అవసరమైన భావోద్వేగాలను తెరపైకి ఆవిష్కరించడంలో, ఎమోషన్స్ ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ కథ అందరికీ తెలియడం వలన ఎక్కడో కొన్ని పాయింట్స్ ని మిస్ చేయడం, ఒకటే యాంగిల్ లో కథ చెప్పారు అన్ని అంశాలను చూపించలేదు అనిపిస్తుంది. దానికి చక్కటి ఉదాహరణే సేమ్ కథ కాదు అని చెప్పడానికి క్లైమాక్స్ లో చేసిన మార్పులు. ముఖ్యంగా వివాదాల నుంచి తప్పించుకోవడం రొటీన్ చేసేసిన క్లైమాక్స్. అలాగే పరువు హత్యల నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి కానీ ఆసమయంలో ఒక ఇంట్లో పడే వేదనపై ఫోకస్ చేస్తూ చేయడమే ఈ సినిమా ప్రత్యేకత. ఇది కాకుండా కథనం కొన్ని చోట్ల బాగా సాగుతూ, సీరియల్ స్టైల్ లో మరీ మెలో డ్రామాగా మార్చేస్తున్నారు ఏందయ్యా అనే ఫీలింగ్ రావడం వలన బోర్ కొడుతుంది. ఆనంద్ చంద్ర ఎమోషన్స్ ని చూపించడంలో సక్సెస్ అయినా ఓవరాల్ గా రెండు గంటలు కూర్చోబెట్టడంలో మాత్రం కాస్త విఫలమయ్యాడు.

ఇక చెప్పుకోవాల్సింది డిఎస్ఆర్ మ్యూజిక్.. ఈయన నేపధ్య సంగీతం చాలా హాంటింగ్ గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ని ఆడియన్స్ ని కి మరింత కనెక్ట్ చేసేది మాత్రం సంగీతమే.. అలాగే జగదీష్ చీకటి విజువల్స్ కూడా బాగున్నాయి. నట్టికుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది.

విజిల్ మోమెంట్స్:

– శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిల అద్భుతమైన నటన
– తండ్రి,  కూతుర్ల మధ్య నడిచే ఎమోషనల్ ఎపిసోడ్స్
– డిఎస్ఆర్ నేపధ్య సంగీతం

బోరింగ్ మోమెంట్స్:

– అందరికీ తెలిసిన కథలో కొన్ని మిస్ అవ్వడం
– స్లోగా సాగే కథనం
– ఓవర్ మెలో డ్రామా సీన్స్
– రన్ టైం
– కాంట్రవర్సీ నుంచి బయటపడటం కోసం చేసిన రొటీన్ క్లైమాక్స్

విశ్లేషణ:

ప్రాణంగా పెంచుకున్న కూతురు వెళ్ళిపోతే ఆ తల్లి తండ్రులు పడే వ్యధ, ఆవేద‌న‌తో పాటు ఆవేశంలో తీసుకునే ఓ తొందరపాటు నిర్ణయం వలన కుటుంబం ఎంత చిందర వందర అవుతుందనేది తెర‌పై ఆవిష్క‌రించే ప్రయత్నమే ఈ మర్డర్. ఇందులో తల్లితండ్రుల యాంగిల్పై ఎక్కువ ఫోకస్ చేసి మిగిలిన అంశాలను మిస్ చేయడం, ఒరిజినాల కథలో ఉన్న కొన్ని పాత్రలని జస్ట్ ఉన్నారంటే ఉన్నారు అని చూపించడం మైనస్. కానీ నటీనటుల అద్భుతమైన నటనతో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి పెద్దలు బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా మర్డర్ సినిమా జస్ట్ ఓకే అనేలా ఉంది.

చూడాలా? వద్దా?: థియేటర్స్ కి రిస్క్ చేసి వెళ్లేంత సినిమా కాదు, ఓటిటిలో అయితే ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...