Switch to English

ఓటిటి రివ్యూ: డర్టీ హరి – ఆ డర్టీ తప్ప ఇంకేం లేదు.!

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
Movie డర్టీ హరి
Star Cast శ్రవణ్ రెడ్డి, రుహాని శర్మ, సిమ్రత్ కౌర్
Director ఎంఎస్ రాజు
Producer సతీష్ బాబు, సాయి పునీత్
Music మార్క్ కె రాబిన్
Run Time 1 గంట 57 నిముషాలు
Release డిసెంబర్ 18, 2020

స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ రాజు తూనీగా తూనీగా సినిమా తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేసిన సినిమా ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో రుహాని శర్మ, సిమ్రత్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. థియేటర్స్ స్కిప్ చేసుకున్న ఈ సినిమా ఫ్రైడే మూవీస్ ఏటిటి ద్వారా రిలీజయింది. చాలా టెక్నికల్ ప్రాబ్లెమ్స్ తర్వాత ఆలస్యంగా రిలీజయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడో చూద్దాం..

కథ:

ఒక చిన్న టౌన్ నుంచి కెరీర్లో మంచి పొజిషన్ కి వెళ్లి రాజులా బ్రతకాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తాడు హరి(శ్రవణ్ రెడ్డి). చాలా తక్కువ రోజుల్లోనే అతనికి రిచ్ గర్ల్ అయిన వసుధ(రుహని శర్మ)తో పరిచయం, ప్రేమ, పెళ్లి అన్ని చకచకా జరిగిపోతాయి. కానీ అదే టైంలో వసుధ అన్నయ్య ఆకాష్ గర్ల్ ఫ్రెండ్ అయిన జాస్మిన్(సిమ్రత్ కౌర్) పై మనసు పడతాడు, తనతో ఇల్లీగల్ రిలేషన్ షిప్ పెట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచీ తన జీవితంలో వచ్చిన సమస్యలేమిటి? తను తీసుకున్న రాంగ్ డెషిషన్స్ ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి? చివరికి వాటి నుంచి బయటపడ్డాడా? లేదా అన్నదే కథ.

తెర మీద స్టార్స్..

శ్రవణ్ రెడ్డికి ఇది మొదటి సినిమా కానీ నటన పరంగా ఆకట్టుకున్నాడు. విలనీ షేడ్స్, డెస్పరేట్ షేడ్స్ మరియు సెటిల్ హావభావాలను బాగా పలికించాడు. సింపుల్ గర్ల్ గా రుహని శర్మ పాత్రలో మెప్పించడమే కాకుండా ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికించింది. ఇక సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచిన సిమ్రత్ కౌర్ హాట్ లుక్స్ తో, రొమాంటిక్ సీన్స్ లో యువతని పిచ్చెక్కించిందనే చెప్పాలి. అలాగే ఫ్రస్ట్రేషన్ షేడ్స్ ని, జలస్ ఫీలింగ్స్ ని పర్ఫెక్ట్ గా పలికించింది. ఫ్రెండ్ పాత్రలో మహేష్ ఓకే అనిపించాడు.

తెర వెనుక టాలెంట్..

సూపర్ హిట్ సినిమా కథలను జడ్జ్ చేసిన ఎంఎస్ రాజు ఈ సినిమా కోసం రాసుకున్న ఈ కథలో యూత్ ని అట్రాక్ట్ చేసే హాట్ సీన్స్, హీరోయిన్ గ్లామర్, బోల్డ్ డైలాగ్స్ మరియు కాచీ టైటిల్ ఇలా అన్నీ సెట్ అయ్యాయి కానీ కథతో మాత్రం అంత కనెక్ట్ చేయలేదు. ఒక దురాశపరుడైన హీరో, చాలా తెలివైన వాడిగా ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ చివరికి వచ్చేసరికి తెలివి తక్కువ వాడిలా బిహేవ్ చెయ్యడం వలన క్యారెక్టర్ తో కనెక్షన్ మిస్ అయిపోతాం. కేవలం గ్లామర్ అడ్డుగా పెట్టుకొని ఓ ఎమోషనల్ మర్డర్ స్టోరీ చెప్పాలనుకున్నారు, కానీ కథనంలో ఎక్కడా సస్పెన్స్ లేకుండా సప్పగా సాగడం వలన, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం వలన బోర్ కొడుతుంది. సినిమా టెంపో స్పీడ్ అవ్వాలి కానీ చివరికి వచ్చేస్తున్నా సాగుతూనే ఉంటుంది. ఒక గంట 57 నిమిషాల సినిమా ఎంతకీ అవ్వదేంటి అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కేవలం చివర్లో చేసిన తప్పుకు వేసిన శిక్ష పాయింట్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా కథ – కథనాలు బిగ్గెస్ట్ మైనస్.. హాట్ సీన్స్ అండ్ డైలాగ్స్ మినహాయిస్తే సినిమాలో చూడాలి అని ఆసక్తి క్రియేట్ చేసే అంశాలు ఏమీ లేవు. నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా ఓకే కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మాత్రం డైరెక్ట్ చేయలేకపోయారు.

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఆ విజువల్స్ కి తగ్గట్టుగానే మార్క్ ఎస్ రాబిన్ మ్యూజిక్ కూడా బాగుంది. జునైద్ ఎడిటింగ్ బాగా స్లోగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– యూత్ ని అట్రాక్ట్ చేసే హాట్ సీన్స్
– సిమ్రత్ కౌర్ గ్లామర్ డోస్ అండ్ డైలాగ్స్
– విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:

– కథలో హిట్స్ సీన్స్ తప్ప కంటెంట్ లేకపోవడం
– పరమ బోరింగ్ కథనం
– బెటర్ గా ఉండాల్సిన హరి పాత్ర డిజైన్
– నో ఎంటర్టైన్మెంట్, నో సస్పెన్స్
– పాత్రలతో కనెక్ట్ అవ్వకపోవడం
– ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం

విశ్లేషణ:

‘డర్టీ హరి’ ఈ మూవీ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాలో డర్టీ సీన్స్ ఉన్నాయి, కానీ సినిమాకి కావాల్సిన కంటెంట్ మాత్రం లేదు. హీరో పాత్రని సరిగా డిజైన్ చేయకపోవడం వలన సినిమా కథ, కథనాల దగ్గరే సరిగా షేప్ అవ్వలేదు. దాంతో తెరపైకి వచ్చేప్పుడు కూడా అంతే బోరింగ్ గా రీచ్ అయ్యింది. ముఖ్యంగా కథలో ఎవరి ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. ఓవరాల్ గా డర్టీ లో డర్టీనే ఉంది తప్ప మేటర్ లేదు.

చూడాలా? వద్దా?: నాలుగు డర్టీ సీన్స్ కోసం అవసరమా?

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....