Switch to English

ఓటిటి రివ్యూ: గువ్వ గోరింక – బాగా సాగదీసిన బోరింగ్ షార్ట్ ఫిల్మ్ లా ఉంది.

Critic Rating
( 1.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie గువ్వ గోరింక
Star Cast సత్యదేవ్, ప్రియా లాల్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
Director మోహన్ బమ్మిడి
Producer దాము రెడ్డి - జీవన్ రెడ్డి
Music సురేష్ బొబ్బిలి
Run Time 1 గంట 57 నిముషాలు
Release డిసెంబర్ 17, 2020

లాక్ డౌన్ టైంలో వరుస ఓటిటి సినిమాలు మరియు సీరీస్ ల సక్సెస్ తో ఫుల్ బిజీ అయిపోయిన హీరో సత్యదేవ్. తను కెరీర్ మొదట్లో హీరోగా చేసి, చాలా రోజులుగా థియేటర్ రిలీజ్ కి నోచుకోని సినిమా ‘గువ్వ గోరింక’. 2017 లో తీసిన ఈ సినిమా ఇన్నాళ్ళకి ఓటిటి ద్వారా రిలీజయ్యింది.

కథ:

శిరీష(ప్రియా లాల్)కి సంగీతం అంటే పిచ్చి.. వయోలిన్ లో మాస్టర్స్ చేయాలనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్న పెళ్లి చేయాలనుకుంటాడు. తన స్టడీస్ పూర్తి చేసాక నాన్న చెప్పిన బావనే పెళ్లి చేసుకుంటా అని హైదరాబాద్ వస్తుంది. తను దిగిన పక్క ఫ్లాట్ లో సౌండ్ అంటే అలర్జీ ఉన్న సదానంద్(సత్యదేవ్) ఉంటాడు. సౌండ్ లేని మెషిన్ తయారు చేయాలనే ప్రాజెక్ట్ పై పి.హెచ్.డి చేస్తుంటాడు. ఒకరిని ఒకరు కలుసుకోక పోయినా మొదట్లో టామ్ అండ్ జెర్రీ లా కొట్టుకున్న వీళ్ళిద్దరూ తర్వాత ఫ్రెండ్స్ గా మారడం, ఆ తర్వాత ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఓ రోజు సదానంద్ కి శిరీష పెళ్లిపై వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట గురించి తెలుస్తుంది. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. అసలు చూడకుండానే ఒకరి ప్రేమలో ఒకరు పడిపోయిన సదానంద్ – శిరీషలు కలిసారా? లేదా? వారు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యారా? లేదా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

ఇది చాలా రోజుల క్రితం సినిమా అయినప్పటికీ సత్యదేవ్ సైలెన్సర్ పాత్రలో బాగా చేసాడు. లవ్ స్టోరీకి తగిన ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పలికించాడు. నటుడిగా తనకి మైలేజ్ పెంచేలానే ఈ సినిమాలోనూ నటించాడు. ఇక కొత్తగా పరిచయం అయిన ప్రియా లాల్ కూడా చాలా బాగా చేసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమని, ఫీలింగ్స్ ని షేర్స్ చేసుకునే సీన్స్ లో హావభావాలు బాగా పలికించారు. కమెడియన్స్ అయిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు అక్కడక్కడా నవ్వించారు. మధుమిత, చైతన్యలు కూడా ఓకే అనిపించారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా హైలైట్ గా నిలిచిన డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే.. ఆర్ట్ డైరెక్టర్ సాంబశివరావు వర్క్ చాలా బాగుంది. ఒక ఫ్లాట్ ని చాలా బాగా డిజైన్ చేయడం వలన విజువల్స్ ఒకేచోట అయినా బోర్ కొట్టదు. మైల్స్ రంగస్వామి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది సురేష్ బొబ్బిలి మ్యూజిక్. మంచి ఫీల్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో లవ్ సీన్స్ లో మెప్పించాడు. ప్రణవ్ మిస్త్రీ ఎడిటింగ్ మాత్రం బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది.

బమ్మిడి జగదీశ్వరరావు డైలాగ్స్ చాలా సింపుల్ గా ఓకే అనిపిస్తాయి, కానీ ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త బెటర్ గా ఉంటే మంచి ఎమోషనల్ కనెక్ట్ వచ్చేది. ఇక డైరెక్టర్ మోహన్ బమ్మిడి విషయానికి వస్తే, కథ చాలా సింపుల్, చెప్పాలంటే ఒక 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథ. అలాంటి కథతో 2 గంటల సినిమా చేశారు. అందుకే కథని బాగా సాగదీసి చెబుతున్నారు అనే ఫీలింగ్ మొదటి 20 నిమిషాల్లోనే కలుగుతుంది. అలాగే కథనంలో కూసింత కూడా స్పీడ్ లేకపోవడం, పోనీ పాత్రల ద్వారా అయినా కథనం ఆసక్తిగా మారుతుందా? అంటే అదీ లేకపోవడం వలన బాగా అంటే బాగా బోర్ కొట్టేస్తుంది. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి నటనని రాబట్టుకోగలిగాడు కానీ రాసుకున్న కథని, ఎమోషన్స్ ని ఆడియన్స్ కి రీచ్ చేయాలేకపోయాడు. దానికి ప్రధాన కారణం ప్రేమ కథ, కథనం అందరికీ తెలిసినవే కావడం. అలాగే హీరో పాత్రకి సౌండ్ అంటే అలర్జీ అనే ప్రాబ్లెమ్ ని చెప్పాడు, కానీ ఆ పాత్రని సరిగా డిజైన్ చేసుకొని వాడుకోలేదని చెప్పాలి. చిన్న బడ్జెట్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సత్యదేవ్, ప్రియా లాల్ నటన
– సురేష్ బొబ్బిలి మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– అదే ప్రేమ కథ
– అంతకన్నా బోర్ కొట్టించే కథనం
– ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడం
– సాగదీత అండ్ రన్ టైం
– నవ్వించలేకపోవడం
– వీక్ డైరెక్షన్

విశ్లేషణ:

‘గువ్వ గోరింక’ మనందరికీ బాగా పరిచయం ఉన్న పేరు, వినగానే బాగా అనిపించే సౌండ్ అండ్ ప్రేమ కథకి పర్ఫెక్ట్ టైటిల్ కూడా.. సినిమా చూసాక ఈ పర్ఫెక్షన్ టైటిల్ దగ్గరే ఆగిపోయింది అనిపిస్తుంది. టెక్నికల్ గా కొన్ని బాగా అనిపించినా, కథ – కథనాలే సినిమాని ప్రేక్షకులకి చేరువ చేస్తాయి. కానీ ఏవీ కనెక్ట్ కాలేదు. మామూలుగానే ఈ సినిమా మూడున్నరేళ్లు ఆలస్యంగా రిలీజయింది, అలాగే అంతకన్నా పాత కథ అవ్వడం వలన, షార్ట్ ఫిల్మ్ కి సరిపోయే పాయింట్ ని సినిమాగా తీయడం లాంటి విషయాల వలన ఈ ‘గువ్వ గోరింక’ జంట ప్లాప్ జంటగా నిలిచింది.

చూడాలా? వద్దా?: సీరియల్స్ స్టైల్ లో కాస్త కాస్త చూడాలన్నా కష్టమే సుమీ.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1/5 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...