Switch to English

రివ్యూ: కరోనా వైరస్ – హిట్టు కాదు, ఫట్టు కాదు.. జస్ట్ ఓకే.

Critic Rating
( 2.00 )
User Rating
( 3.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie కరోనా వైరస్
Star Cast శ్రీకాంత్ అయ్యంగర్, వంశీ చాగంటి, సోనియా, దక్షి గుత్తికొండ
Director అగస్త్య మంజు
Producer రామ్ గోపాల్ వర్మ
Music డిఎస్ఆర్
Run Time 1 గంట 24 నిముషాలు
Release డిసెంబర్ 11, 2020

వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ టెక్నిషియన్ అనే స్థాయి నుంచి వివాదాలతో కాష్ చేసుకునే వ్యక్తి అనే స్థాయికి దిగజారిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దేశం మొత్తం కరోనాతో లాక్ డౌన్ లో పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఆ కరోనా వైరస్ పైనే సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. థియేటర్స్ లేని కారణంగా విడులా ఆలస్యం అయిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో మరియు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజయింది. ఈ కరోనా వైరస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

7 మంది కుటుంబ సభ్యులు కలిగిన ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి పెద్ద మన కె. ఆనంద్ రావు(శ్రీకాంత్ అయ్యంగర్). కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి బయట ఉన్న పరిస్థితులను, టీవీల్లో వస్తున్న వార్తల్ని చూసి, సంబందం లేకుండా ప్రభుత్వాలు చెబుతున్న స్టేట్మెంట్స్, వాట్సాప్ లో వస్తున్న మెసేజెస్.. ఇలాంటి పలు విషయాల వల్ల ఆనంద్ రావు కుటుంబం మానసికంగా ఎలాంటి భయాలకు లోనైంది? ఆ భయం వల్ల వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్లలో వాళ్ళకి ఎలాంటి విభేదాలు వచ్చాయి? చివరికి ఆ కుటుంబం కరోనా బారిన పడిందా? లేదా అనేదే కథ.

తెర మీద స్టార్స్..

కరోనా వైరస్ సినిమాకి షో టాపర్ మాత్రం శ్రీకాంత్ అయ్యంగర్ నటననే చెప్పాలి. తన నటన వలనే ఆ కథ ఏదో మన ఇంట్లోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. తన రియలిస్టిక్ నటనకి అందరూ శభాష్ అనాల్సిందే. హీరోగా కనిపించిన వంశీ చాగంటి కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ యాక్ట్ చాలా బాగుంది. సోనియా ఆకుల తన పాత్ర పరిధిమేర నటించారు. తెలుగు అమ్మాయి అయిన దక్షి గుత్తికొండ కూడా తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది.

తెర వెనుక టాలెంట్..

కథ అందరికీ తెలిసిందే, అనుభవించిందే.. కరోనా వైరస్ అనౌన్స్ మెంట్ రాగానే దాని గురించి సరైన అవగాహన లేక ప్రతి ఇంట్లో పడిన భయాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించే ప్రయత్నమే ఈ కరోనా వైరస్ కథ. కావున కథలో పెద్ద కిక్ ఉండదు. కథనంలో ఆ భయాన్ని క్రియేట్ చేయడంలో మొదట్లో సక్సెస్ అయ్యారు, కానీ కొంత సేపటి తర్వాత వచ్చే సీన్స్ మరియు వాటి రియాక్షన్స్ కామన్ అయిపోవడం వలన ఆధ్యంతం ఆసక్తిగా సాగలేదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ బాగానే అనిపిస్తుంది. డైరెక్టర్ అగస్త్య మంజు ఇంకా షార్ట్ గా చెప్పి ఉంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అనే ఫీలింగ్ కలగకుండా ఉండేది. స్క్రీన్ ప్లే కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది. కథలో వైఎస్ జగన్ చెప్పిన బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ పాయింట్ ని బాగా వాడారు.

విజువల్స్ బాగున్నాయి. ఒకే ఇంట్లో సినిమా మొత్తం ఫినిష్ చేసినప్పటికీ షాట్ మేకింగ్ బాగుండడం వలన ఆ ఫీల్ రాలేదు. డిఎస్ఆర్ మ్యూజిక్ కూడా ఓకే అనేలా ఉంది. సౌండింగ్ లో భయాన్ని బాగా క్రియేట్ చేశారు.

విజిల్ మోమెంట్స్:

– శ్రీకాంత్ అయ్యంగర్ నటన
– ఎమోషనల్ క్లైమాక్స్
– కరోనా పేరుతో భయాన్ని క్రియేట్ చేయడం
– వైఎస్ జగన్ స్టేట్మెంట్స్ పై వేసిన పంచ్

బోరింగ్ మోమెంట్స్:

– అందరికీ తెలిసిన కథ
– సెకండాఫ్ కథనం
– రిపీటెడ్ అనిపించే సీన్స్
– చెప్పలనుకున్న పాయింట్ ఓల్డ్ అయిపోవడం

విశ్లేషణ:

ఆర్జీవీ నిర్మాణ సారధ్యంలో, ఆయన సూచనలతో అగస్త్య మంజు డైరెక్ట్ చేసిన ‘కరోనా వైరస్’ సినిమా కంప్లీట్ గా బాగుంది అనలేం, ఆలా అని బాగోలేదు అని చెప్పలేం. మన నిజజీవితంలో జరిగిన సంఘటనలే కావడం, అందులో కొన్ని కనెక్ట్ అవ్వడం వలన జస్ట్ పరవాలేదు అనిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైంలోనే ఈ సినిమా తీశారు. థియేటర్స్ కోసం కాకూండా అప్పుడే ఓటిటిలో రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యి ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు దాదాపు నార్మల్ స్టేజ్ కి వచ్చేసాక రిలీజ్ చేయడం వలన కాస్త ఓల్డ్ కంటెంట్ అనే ఫీలింగ్ వస్తుంది.

చూడాలా? వద్దా?: చూడటానికి ఏమీ లేకపోతె ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...