Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: ఆకాశం నీ హద్దురా – హార్ట్ టచింగ్ ఎమోషనల్ రైడ్.!

Critic Rating
( 3.25 )
User Rating
( 4.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow
Movie ఆకాశం నీ హద్దురా
Star Cast సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్
Director సుధ కొంగర
Producer సూర్య, గుణీత్ మోంగా
Music జివి ప్రకాష్ కుమార్
Run Time 2 గంటల 29 నిముషాలు
Release నవంబర్ 12, 2020

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న సూర్య హీరోగా, గురు సినిమాతో తన సత్తా చాటుకున్న సుధ కొంగర డైరెక్షన్ లో చేసిన సినిమా ‘ఆకాశం నీ హద్దు రా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జిఆర్ గోపినాథ్ జీవితంలోని కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా కోవిడ్ కారణంగా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజయ్యింది. మరి ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

చంద్ర మహేష్(సూర్య) కి జీవితంలో జరిగిన ఒక పర్సనల్ లాస్ వలన సామాన్య ప్రజలు ఒక రైల్వే టికెట్ ధరకే విమానయానం చేసేలా తనొక ఎయిర్ వేస్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. తన దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది కానీ ఎవరూ అతనికి లోన్ ఇవ్వరు. కానీ తన ప్రయత్నాల్ని మాత్రం ఆపడు. చివరికి తన ఐడియా తో ఇండియా లో టాప్ ఎయిర్ వేస్ ఓనర్ అయిన పరేష్(పరేష్ రావల్)ని సంప్రదిస్తాడు. కానీ పరేష్ మహేష్ చెప్పిన ఐడియా తిరష్కరించడమే కాకుండా, మహేష్ డ్రీం నిజం కాకుండా అడ్డుపడతాడు. అలా అడ్డు పడిన ప్రతి అడ్డంకిని ఎదుర్కొని, చివరికి మహేష్ సామాన్యుడు అతి తక్కువ ధరకే ఫ్లైట్ ఎక్కాలనే తన డ్రీమ్ ని నిజం చేశాడా? లేదా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

మొదటగా ఈ సినిమాకి చేసిన నటీనటుల ఎంపిక 200% పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని చెప్పాలి. ఆ విషయంలో డైరెక్టర్ సుధ కొంగర ఫస్ట్ సక్సెస్ కొట్టేసింది. మొదటగా సినిమాని నడిపించిన హీరో సూర్య ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయాడు. నటనలో సరికొత్త సూర్యని చూడడమే కాకుండా ప్రతి ఒక్కరూ పాత్రతో కనెక్ట్ అయిపోతారు. తెరపై సూర్య ఏ ఎమోషన్ చూపుతుంటే ఆ ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ ఐపోతారు. తను నవ్వితే నవ్వుతారు, పాట పడితే డాన్స్ వేస్తారు, ఏడిస్తే ఏడుస్తారు ఇలా అన్నిటికీ కనెక్ట్ అయిపోతారు. ఓవరాల్ గా సూర్య తన నటితో సినిమాని అందరి మనసును టచ్ చేసాడు. హీరోయిన్ గా చేసిన అపర్ణ బాలమురళి కూడా టఫ్ గర్ల్ గా, వైఫ్ గా అదరగొట్టింది. ఇక ముఖ్య పాత్రలు చేసిన మోహన్ బాబు, పరేష్ రావల్ లాంటి వాళ్ళు సినిమాకి మరింత హెల్ప్ అయ్యారు.

తెర వెనుక టాలెంట్..

కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన సుధ కొంగరకి ఇలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చే ధైర్యం చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కథ దగ్గర నుంచీ తను తీసుకున్న జాగ్రత్త సినిమాలో క్లియర్ గా తెలుస్తుంది. కథ పరంగా పాత్రలని తీర్చిదిద్దిన విధానం, ఎమోషన్స్ ని పొందుపరిచిన విధానం సూపర్ అని చెప్పాలి. కథనం పరంగా ఒక 10-20% తప్ప మిగతా అంతా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లింది. సెకండాఫ్ లో కొన్ని కొన్ని సన్నివేశాలను మనం ఊహించేయగలగడం, ఇంకా ఎన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి అనే చిన్న ఫీలింగ్ కాసేపు కలుగుతుంది. అలాగే కథా పరంగా అక్కడక్కడా కాస్త కామెడీని వర్కౌట్ చేసి ఉండచ్చు కానీ చేయకపోవడం కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గా అయితే తను అనుకున్న కథని, ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఓవరాల్ గా డైరెక్టర్ గా ఫెంటాస్టిక్ అనిపించుకుంది.

ఇక టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో ఈ సినిమాకి ప్రధాన బలం నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్. విజువల్స్ ఎంత రియలిస్టిక్ గా మనకు కథని కనెక్ట్ చేశాయో, అంతే ఎఫెక్ట్ గా ఆ విజువల్స్ మనకు గుర్తుండిపోయేలా మ్యూజిక్ ఉంది. పాటలు, నేపధ్య సంగీతం అదరగొట్టేసాడు జివి ప్రకాష్ కుమార్. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా బాగుంది. ఇలాంటి సినిమాతో సూర్య తన ప్రొడక్షన్ కి ఎనలేని గౌరవం తెచ్చిపెట్టారని చెప్పచ్చు.

విజిల్ మోమెంట్స్:

– సూర్య మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్
– ప్రేక్షకుల మనసుకు హత్తుకునే కథ
– సూపర్బ్ ఫస్ట్ హాఫ్
– ఎమోషనల్ సీన్స్
– హార్ట్ టచింగ్ క్లైమాక్స్
– ఫెంటాస్టిక్ డైరెక్షన్
– విజువల్స్ + మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– సెకండాఫ్ కాస్త సాగినట్టు ఉండడం
– రిపీట్ అనిపించే సమస్యలు
– ఇంకాస్త బెటర్ కామెడీ

విశ్లేషణ:

కరోనా పాండెమిక్ టైం నుంచీ ఓటిటిలో ఒక మంచి సూపర్ హిట్ సినిమా చూడాలి అనుకునే వారి కోరికని సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దు రా’ తీర్చిందని చెప్పచ్చు. ఆకాశం నీ హద్దు రా సినిమా ప్రతి ఒక్కరికీ పాత్రల పరంగా, ఎమోషన్ పరంగా పక్కాగా కనెక్ట్ అవుతుంది . అదీ కాక యదార్థ సంఘటన ఆధారంగా, ఎంతో కొంత తెలిసిన కథ కావడం వలన ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా ఆకాశం నీ హద్దు రా ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యే ఎమోషనల్ రైడ్.

చూడాలా? వద్దా?: ఇంట్లోని సభ్యులంతా హ్యాపీగా చూడచ్చు.

                                 తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 3.25/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...