Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: గతం – ఇప్పటి ప్రేక్షకులను థ్రిల్ చేయలేక గతంలోనే కలిసిపోయింది.!

Critic Rating
( 1.50 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie గతం
Star Cast భార్గవ పోలుదాసు, రాకేష్, పూజిత
Director కిరణ్ కొండమడుగుల
Producer భార్గవ, హర్ష ప్రతాప్, సృజన్
Music శ్రీచరణ్ పాకాల
Run Time 1 గంట 42 నిముషాలు
Release నవంబర్ 6, 2020

అమెరికాలో సెటిల్ అయిన కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కలిసి, తమకి సినిమా మీద ఉన్న ప్రేమతో తీసిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ‘గతం’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత థ్రిల్లింగా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

రిషి(రాకేష్)కి యాక్సిడెంట్ వలన తన బ్రెయిన్ డామేజ్ అయ్యి గతం మొత్తం మరచిపోతాడు. తనని చూసుకోవడానికి తన దగ్గర గర్ల్ ఫ్రెండ్ అదితి(పూజిత) మాత్రమే ఉంటుంది. స్పృహలోకి వచ్చిన రిషి తన ఫాదర్ ని కలవడానికి అదితితో కలిసి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన వాళ్ళ కార్ మధ్యలోనే బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ రాత్రి అక్కడికి దగ్గర్లో ఉన్న అర్జున్(భార్గవ) హౌస్ లో షెల్టర్ తీసుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే రిషి – అదితిలు అర్జున్ ట్రాప్ లో పడతారు. ఇక అక్కడి నుంచి రిషి – అదితిలు ఈ హౌస్ నుంచి ఎలా బయట పడ్డారు. అసలు ఎందుకు అర్జున్ వాళ్ళిద్దరినీ ట్రాప్ చేసాడు? అన్నదే మీరు తెలుసుకోవాల్సిన కథ.

తెర మీద స్టార్స్..

తెరపై ప్రధాన పాత్రల్లో కనిపించిన రాకేష్, భార్గవ, పూజితలు చాలా మంచి నటనని కనబరిచారు. ముఖ్యంగా భార్గవకి నటుడిగా కొత్త సినిమా అయినప్పటికీ ఫాదర్ పాత్రలో మంచి ఎమోషన్స్ ని కనబరిచారు. అలాగే సపోర్టింగ్ పాత్రల్లో నటించిన లక్ష్మీ భరద్వాజ్, హర్షలు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.

తెర వెనుక టాలెంట్..

ఇక్కడ మొదటగా మాట్లాడుకోవాల్సింది రెండు డిపార్ట్మెంట్స్ గురించి.. ఒకటి సినిమాటోగ్రఫీ, రెండు సౌండింగ్.. మనోజ్ రెడ్డి అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా అబ్రాడ్ లొకేషన్స్ కావడం వలన కొన్ని షాట్స్ ని డిజైన్ చేసిన విధానం థ్రిల్లర్ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయేలా ఉంది. ఇకపోతే శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ మిక్సింగ్ సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా చేశాయి. ఈఎస్ ఎడిటింగ్ కూడా ఓకే, లెంగ్త్ తక్కువైనప్పటికీ పలు చోట్ల లాగ్ అనిపిస్తుంది. కానీ అది ఎడిటింగ్ తప్పిదం అనడం కంటే స్క్రీన్ ప్లే లోపం అని చెప్పచ్చు. ఆర్ట్ వర్క్ కూడా చాలా నీట్ గా ప్లాన్ చేశారు.

ఈ చిత్రానికి ప్రధాన కారకుడు రచయిత మరియు డైరెక్టర్ కిరణ్ విషయానికి వస్తే.. తన సినిమా కోసం ఎంచుకున్న కథ వెరీ సింపుల్ మిస్సింగ్ క్రైమ్ స్టోరీ.. ఇప్పటి వరకూ మన ఆడియన్స్ చూసేసిన సినిమానే.. క్రైమ్ స్టోరీస్ ఎక్కువ ఇలానే ఉంటాయి, కానీ కథనంలో ఆధ్యంతం ఆకట్టుకునేలా తీసుకెళ్ళడమే ఈ థ్రిల్లర్ సినిమాల సీక్రెట్.. కథనంలో మొదటి 15 – 20 నిమిషాలు ఆ సస్పెన్స్ ని కాస్త మైంటైన్ చేశారు. ఎప్పుడైతే కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి సినిమా పూర్తి ఊహాజనితంగా మారిపోయింది. కథ మొత్తం తెరిచిన పుస్తకంలా ఆడియన్స్ ముందు పెట్టేసారు. దాచుకున్న ఒకటి రెండు ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలకపోవడంతో థ్రిల్లింగ్ సంగతి ఏమో గానీ చూసే వారికి బోరింగ్ కలిగిస్తుంది. నటన పరంగా నటీనటుల నటన ఓకే, కానీ పాత్రల డిజైనింగ్ ఇంకాస్త క్లియర్ గా, వారి ఎమోషన్స్ ని డైరెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు. అనుకున్న పాయింట్ ని సినిమా మొదలవ్వగానే వేసిన కొటేషన్ లో కాకుద్నా సినిమాలోని పాత్రల ద్వారా రీచ్ చెయ్యడానికి ట్రై చేసి ఉంటే సినిమా ఇంకోలా ఉండేది. డైరెక్టర్ కిరణ్ విజువల్ మేకింగ్ లో సక్సెస్ అయినా ప్రేక్షకులని మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– విజువల్స్
– సౌండింగ్
– కొన్ని సన్నివేశాలు

బోరింగ్ మోమెంట్స్:

– అదే పాత క్రైమ్ స్టోరీ
– అంతకు మించిన బోరింగ్ స్క్రీన్ ప్లే
– ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సింగ్
– డైరెక్షన్
– ఆకట్టుకోని థ్రిల్స్

విశ్లేషణ:

సినిమా అంటే ఎంతో ఇష్టంతో, యూస్ లో తమ ఉద్యోగాలతో బిజీగా ఉంటూ కూడా ఇలాంటి ఓ మంచి క్వాలిటీ సినిమాని తీసి, రిలీజ్ చేసినందుకు ముందుగా ‘గతం’ చిత్ర టీంలోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించాలి. కానీ సినిమా పరంగా చూస్తే, ఓవరాల్ సినిమా థ్రిల్ చేసిందా? లేదా? ఆడియన్స్ తమ విలువైన సమయాన్ని వెచ్చించి చూసే సినిమానా అంటే మాత్రం నో అనే చెప్పాలి. ఓవరాల్ గా ‘గతం’ సినిమా మంచి టెక్నీకల్ వాల్యూస్ తో రూపొంది, ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయిన బోరింగ్ థ్రిల్లర్.

చూడాలా? వద్దా?: చప్పగా అనిపించే ఈ థ్రిల్లర్ ని చూడడం కష్టమే.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...