Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: చంద్రబాబుకి ఏపీ పోలీస్‌ తాజా నోటీస్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కొద్ది రోజుల క్రితం జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌కి గురవుతున్నాయంటూ ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం తెలిసిన విషయాలే. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు వుంటే సమర్పించాలంటూ సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేఖ రాశారు. తాజాగా, చంద్రబాబుకి అలాంటిదే ఇంకో లేఖ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ నుంచి వెళ్ళింది. ఈసారి ‘నోటీసు’ రూపంలో కావడం గమనార్హం. కంటెంట్‌ దాదాపుగా ఒకటే.. కానీ, టాపిక్‌ వేరే.

ఈసారి టాపిక్‌, చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఓంప్రతాప్‌ అనుమానాస్పద మృతి. ఓం ప్రతాప్‌ మరణానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమని చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఆరోపించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై పోలీసులు చంద్రబాబుకి నోటీసు పంపారు. ‘చంద్రబాబుకి మాత్రమే కాదు, నారా లోకేష్‌తోపాటు వర్ల రామయ్యకు కూడా నోటీసులు పంపాం. వారం రోజుల్లోగా వారు తమ వద్దనున్న ఆధారాల్ని సమర్పించాలి..’ అని ఓ పోలీస్‌ అధికారి సెలవిచ్చారు.

జడ్జిల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడం, పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. విచారణ జరిపి, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలుకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఇక, ఇప్పుడు ఓం ప్రకాష్‌ అనుమానాస్పద మరణం వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

అన్నట్టు, విశాఖలో ఇటీవల సంభవించిన వరుస ప్రమాదాలకు టీడీపీనే కారణమని వైసీపీ నేతలు ఆరోపించారు. అవి పత్రికల్లోనూ వచ్చాయి. మరి, ఆయా కేసుల్ని విచారించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, ఆయా కేసుల్లో అధికార పార్టీ నేతలకూ ఇలాగే నోటీసులు పంపారా.? అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ నుంచి దూసుకొస్తున్నాయి. ఏంటో, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా.. దాని చుట్టూ భిన్నమైన అనుమానాలు, కథనాలు, ఆరోపణలు.. కనీ వినీ ఎరుగని రీతిలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయమే వేరు.. ఆ కథే వేరు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...