Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: జోహార్ – హార్ట్ టచింగ్ ఎమోషనల్ రైడ్.!

Critic Rating
( 3.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow
Movie జోహార్
Star Cast నైనా గంగూలీ, చైతన్య కృష్ణ, ఎస్తర్ అనిల్, ఈశ్వరి రావు, శుభలేఖ సుధాకర్..
Director తేజ మర్ని
Producer సందీప్ మర్ని
Music ప్రియదర్శన్
Run Time 2 గంటల 2 నిమిషాలు
Release ఆగష్టు 14, 2020

నైనా గంగూలీ, చైతన్య కృష్ణ, ఎస్తర్ అనిల్, ఈశ్వరి రావు, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో తేజ మర్ని దర్శకుడుగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘జోహార్’. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన డైరెక్ట్ గా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. యంగ్ టాలెంట్ అంతా కలిసి చేసిన ఈ జోహార్ సినిమా ఎంత ఎంజాయ్ చేసేలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

రోడ్డు మీద సర్కస్ చేస్తూ, పరుగు పందెంలో దేశం కోసం గోల్డ్ మెడల్ గెలవాలనుకునే అమ్మాయి బాల(నైనా గంగూలీ)…
తన ప్రాణం పోయినా తన హాస్టల్లో పిల్లలకి సరైన తిండి, వసతి కల్పించాలని ప్రభుత్వ నిధుల కోసం తిరిగే వ్యక్తి బోస్(శుభలేఖ సుధాకర్)…
ఉద్దానం కిడ్నీ సమస్యతో భర్తని పోగొట్టుకొని కూతుర్ని కూడా పోగొట్టుకొనే పరిస్థితిలో ఉన్న తల్లి గంగమ్మ(ఈశ్వరి రావు)…
చదువే జీవితం అనుకొని ప్రేమించిన వ్యక్తితో రాజమండ్రి పారిపోయిన వేశ్య కూతురు జ్యోతి(ఎస్తర్ అనిల్)…

ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేని నాలుగు జీవితాలు.. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య చనిపోవడంతో ఆ స్థానంలోకి వచ్చిన తన వారసుడు సీఎం విజయ్ వర్మ (చైతన్య కృష్ణ), తన పార్టీ పరువు, తన తండ్రి విగ్రహాన్ని ప్రపంచమంతా చెప్పుకునేలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించాలని అనుకుంటాడు. ఆ నిర్ణయం వలన పై నాలుగు జీవితాల్లో కలిగిన మార్పులేంటి? వారి వారి సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరికిందా? లేక ఆ యంగ్ సీఎం తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్ర ప్రజలకి జరిగిన నష్టమేంటి? అన్నదే కథ.

తెర మీద స్టార్స్..

వారు వీరు అని కాదు తెరమీద కనిపించిన చిన్న పిల్లల నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకూ ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటనని కనబరిచారు. అన్ని కథల్లోకి ఎక్కువ ఎంగేజింగ్ గా అనిపించేది ఈశ్వరి రావు కథ. ఈ తల్లి – కూతురి ఎమోషన్స్ పలు చోట్ల కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తే, అంకిత్ – ఎస్తర్ లు రియలిస్టిక్ లవ్ స్టోరీ మనం భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. మిగిలిన రెండు కథల్లో శుభలేఖ సుధాకర్, నైనా గంగూలీలు ది బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే వరకూ ఓన్లీ గ్లామర్ రోల్స్ మాత్రమే కనిపించిన నైనా గంగూలీకి ఇందులో తన టాలెంట్ ని చూపించే అవకాశం దక్కింది. చేసింది ఒక్క సీన్ అయినప్పటికీ రోహిణి గారి బెస్ట్ వర్క్స్ లో నిలిచిపోతుంది.

తెర వెనుక టాలెంట్..

సాంకేతిక విభాగంలో నాలుగు డిపార్ట్మెంట్స్ మాత్రం 100కి 200 మార్కులు కొట్టేశాయి.. వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది, డైలాగ్ రైటర్ రామ్ వంశీ కృష్ణ.. అతను ప్రతి కథలోనూ, ప్రతి పాత్రకి ముత్యాల్లాంటి మాటలు రాశారు. ప్రతి మాట మిమ్మల్ని అబ్బురపరుస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా సక్సెస్ లో ఫస్ట్ సగం క్రెడిట్ ఇతని డైలాగ్స్ కి ఇవ్వచ్చు. తరువాతి రెండు డిపార్ట్మెంట్స్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ.. దర్శకుడు అనుకున్న భావాల్ని డిఓపి ఓ దృశ్య కావ్యంలా తెరపైకి అనువదిస్తే మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ దానికి ప్రాణం పోసి చూసిన వారి మనసును బరువెక్కిపోయి, కళ్ళు చెమ్మగిల్లేలా చేశారు. ఇక చివరిగా గాంధీ ఆర్ట్ వర్క్ కూడా ప్రతి కథకి జీవం పోసింది. వీరి ముగ్గురి పని తనం సినిమాని దృశ్యం, శ్రవణం పరంగా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. సిద్దార్థ – అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అక్కడక్కడా స్పీడ్ కట్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్., తేజ మర్ని విషయానికి వస్తే.. దేశం సంక్షోభంలో ఉన్నా, పేదరికం పెరిగిపోతున్నా, సామాన్యులకి జీవనం అసాధ్యం అయిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా వారి విగ్రహ రాజకీయాలు వారు చేసుకుంటూ పోతుంటారు అనే ఇతివృత్తాన్ని కథాంశంగా సెలక్ట్ చేసుకోవడం ఈ సినిమాకి అతిపెద్ద బలం.. ప్రభుత్వం తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయం ప్రజలకి ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుంది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. కథ పరంగా ఎంచుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చూసే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశారు. అందుకు మెచ్చుకునే తీరాలి. కథనం పరంగా మొదటి భాగం బాగుందనిపించినా, రెండవభాగం మాత్రం ప్రతిదీ మనం ఊహించేయగలగడంతో కాస్త బోరింగ్ గా వెళుతుంది. మళ్ళీ క్లైమాక్స్ లో రోహిణి సీన్ తో పరవాలేధనిపించి, ముగించడం బాగనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గా అనుకున్నది తీయడంలో ది బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. సందీప్ మర్ని – రత్నాజీ రావు మర్ని నిర్మాణ విలువలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నాయి. చివరిలో విగ్రహం కోసం వాడిన సిజి షాట్స్ కూడా సూపర్బ్.

విజిల్ మోమెంట్స్:

– అందరి నటీనటుల నటన
– ఎమోషనల్ సీన్స్ అండ్ డైలాగ్స్
– కథాంశం
– మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ
– మొదటి అర్ధభాగం మరియు క్లైమాక్స్

బోరింగ్ మోమెంట్స్:

– ఊహాజనిత రెండవ అర్ధభాగం
– ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిన కథనం
– రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

విశ్లేషణ:

ప్రజలకి సేవ చేయాల్సిన నాయకులు సొంత ప్రయోజనాల కోసం తీసుకునే ఒక్కో నిర్ణయం ప్రజలపై ఎలాంటి ఉక్కుపాదం మోపుతోంది అనేది చెప్పడమే ఈ జోహార్.. ఇటు నటీనటునటులు, అటు సాంకేతిక నిపుణులు ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పగలిగే సినిమా ‘జోహార్’. ఊహాజనిత సెకండాఫ్, స్లోగా సాగే కథనం మరియు రెగ్యులర్ గా కోరుకునే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయితే, చూసిన వారికి మాత్రం ఇదొక హార్ట్ టచింగ్ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుంది.

చూడాలా? వద్దా?: మాకు మూస సినిమాలే నచ్చుతాయి అనుకునే వారు తప్ప, మిగతా అందరూ చూడచ్చు.!

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 3/5 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...