Switch to English

రౌడీలను రఫ్ఫాడిస్తున్న యోగి: మూడేళ్లలో 5వేల ఎన్ కౌంటర్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే గూండా రాజ్యమే అనే భావన ఉండేది. ఎక్కడ చూసినా గ్యాంగులు, రౌడీయిజం.. అచ్చం సినిమాల్లో చూసినట్టుగానే కనిపించేది. ఆయా రౌడీ గ్యాంగులకు రాజకీయ నేతల అండదండలు ఉండేవి. వారికి వీరు.. వీరికి వారు పరస్పరం సహకరించుకునేవారు. ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఉన్న ప్రభుత్వాలు రౌడీయిజాన్ని అణచివేసే విషయంలో అంత సమర్థంగా పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. రౌడీల పాలిట సింహస్వప్నంగా మారారు.

గుండాగిరీ అనేదే లేకుండా చేయాలని సంకల్పించారు. దీంతో ఆయన హయాంలో వేలాది ఎన్ కౌంటర్లు జరిగాయి. మూడేళ్లలో ఏకంగా 5,148 ఎన్ కౌంటర్లు జరగ్గా.. 108 మంది రౌడీలు హతమయ్యారు. 1848 మంది గాయపడ్డారు. తాజాగా ఎనిమిది మంది పోలీసులను చంపిన రౌడీ షీటర్ వికాస్ దుబేతోపాటు అతడి అనుచరులను కూడా యూపీ పోలీసులు మట్టుబెట్టారు. రౌడీయిజాన్ని యోగి ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో రౌడీ షీటర్లు బెంబేలెత్తిపోయారు. బెయిల్ పై ఉన్నవాళ్లు, ఇతరత్రా కారణాలతో బయట ఉన్నవారు వెంటనే జైలుకు వెళ్లిపోయారు. ఈ మూడేళ్లలో ఏకంగా 17,145 మంది రౌడీలు తమంతట తాముగా కారాగార బాట పట్టారు. అక్కడైతే తాము కనీసం ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని అలా చేశారు. దీంతో యూపీలో పరిస్థితులు గణనీయంగా మారాయి. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా గూండాయిజాన్ని అదుపు చేయడంలో యోగికి నూటికి నూరు మార్కులు ఇవ్వాల్సిందే.

గతంలో ఎన్ కౌంటర్ అంటే పెద్ద చర్చ జరిగేది. నిజంగా జరిగిన ఎన్ కౌంటర్ల విషయంలోనూ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారాయి. ప్రజలు సైతం ఇన్ స్టెంట్ న్యాయాన్ని కోరుకుంటున్నారు. కరడుగట్టిన నేరస్తులను ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలా చేసిన పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్నారు. మొన్న దిశ హత్యాచార కేసులో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపించినట్టే.. తాజాగా దుబేను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను పూలదండలతో ముంచెత్తారు. కరడు గట్టిన నేరస్థుల పట్ల పోలీసులు ఇలా కఠినంగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...