Switch to English

కుయ్‌.. కుయ్‌.. కుయ్‌..: వైఎస్సార్, జగన్.. పేదోడి నాడి తెలిసిన డాక్టర్లు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పేదోడి నాడి తెలిసిన డాక్టర్‌గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అభివర్ణిస్తారు చాలామంది. రాజకీయ విమర్శలు ఎలా వున్నా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తెరపైకొచ్చిన ఆరోగ్యశ్రీ.. ఎంతోమంది పేదలకు ‘ఊపిరి’ పోసిందన్నది నిర్వివాదాంశం. 108 అంబులెన్స్‌లు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రముఖ ప్రాచుర్యం పొందిన విషయం విదితమే. ఏదన్నా ప్రమాదం జరిగినా, హఠాత్తుగా గుండె నొప్పి ఇతర ప్రాణాంతకమైన సమస్యలు తలెత్తినా వెంటనే 108కి కాల్‌ చేస్తే చాలు.. అతి తక్కువ సమయంలో అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది.. బాధితుల్ని ఆసుపత్రులకు తరలించేస్తుంది. అలా ఎన్నో ప్రాణాలు 108 ద్వారా కాపాడబడ్డాయి. కానీ, కొన్ని కారణాలతో ఈ 108 సర్వీస్‌ కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక, ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, రికార్డు స్థాయిలో కొత్త అంబులెన్స్‌ల్ని రంగంలోకి దించింది 108తోపాటు 104 సర్వీసులు.. నియోనాటల్‌ అంబులెన్స్‌లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరమైన మందులతో, గతంలో కంటే భిన్నంగా అనేక వైద్య పరీక్షలు చేసే వెసులుబాట్లతో వీటిని రూపొందించారు. వీలైనంత ఎక్కువమందికి సేవలు అందించేలా ఈ కొత్త అంబులెన్స్‌లను డిజైన్‌ చేశారు.

ఒకేసారి పెద్దమొత్తంలో కొత్త అంబులెన్స్‌లను తీసుకురావడం ద్వారా ప్రజారోగ్యంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుంటోందన్నది అధికార పార్టీ వాదనగా కన్పిస్తోంది. 108 వెనుక పెద్ద కుంభకోణం జరిగిందనే విపక్షాల విమర్శల్ని పక్కన పెడితే, పేదోడి ఆయువు నిలబెట్టే సంజీవనిగా ఈ 108, 104 అంబులెన్స్‌లను చూడాల్సి వస్తుంది. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా, గిరిజన ప్రాంతాల్లో అయినా అత్యవసర పరిస్థితుల్లో వున్నవారికి రికార్డు స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ఈ అంబులెన్స్‌లను రూపొందించారు. ఆధార్‌ కోసం బయోమెట్రిక్‌ యంత్రాల్ని వీటిల్లో అమర్చారు. తద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాల్ని పొందు పర్చడానికి వీలవుతుంది. జీపీఎస్‌, మొబైల్‌ డేటా టెర్మినల్‌, ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌.. వంటి ఏర్పాట్లు ఈ అంబులెన్స్‌లలో వున్నాయి.

104 వాహనాల ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్ళి మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో ఈ వాహనాల్లోనే ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్స్‌ ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందుల్ని రోగులకు ఇస్తారు. టెలిమెడిసిన్‌ విధానం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారిని అతి తక్కువ సమయంలో ఆసుపత్రులకు చేర్చి, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అంబులెన్స్‌లు ఎంతగానో ఉపయోగపడ్తాయి. బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌, అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌.. అంటూ రెండు కేటగిరీల్లో 108 అంబులెన్స్‌లను తీర్చిదిద్దడం గమనార్హం.

మొత్తమ్మీద, ఇకపై రాష్ట్రంలో మరింత మెరుగ్గా 108, 104 సేవలు ప్రజలకు అందుతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, ఈ సేవల విషయంలో మొదట ప్రదర్శించిన ఉత్సాహం ఆ తర్వాత పాలకుల్లో వుండటంలేదు. చిన్నపాటి మరమ్మత్తులు రాగానే ఖరీదైన వాహనాల్ని మూలన పడేస్తున్న సందర్భాలు గతంలో చూశాం. ఈసారి అలాంటి నిర్లక్ష్యానికి ఆస్కారమివ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందనే ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...