Switch to English

‘సలహా’దారులపై జగన్‌ సర్కార్‌కి హైకోర్టు అక్షింతలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి రికార్డు స్థాయిలో సలహాదారులున్నారు. వివిధ విభాగాల్లో వారంతా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సి వుంటుంది. ఏ ప్రభుత్వానికి అయినా సలహాదారులు తప్పనిసరైపోయింది. అయితే, ఆ పోస్టుల్లో ‘అయినవారికి’ ప్రాధాన్యమివ్వడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. రాజకీయంగా తమ ఎదుగుదలకు సహకరించినవారిని ఆ పదవుల్లో పెట్టుకోవడంపై చాలా విమర్శలున్నా.. ఈ ‘సలహాదారుల’ విషయంలో అధికార పార్టీల తీరు మారడంలేదు. చంద్రబాబు హయాంలోనూ ఈ తరహా విమర్శలు చాలానే వచ్చాయి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో అవి మరింత పెరిగాయి.

తాజాగా హైకోర్టు, సలహాదారుల విషయంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మొట్టికాయలేసింది. నిన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌, హైకోర్టుకి వచ్చారు. ఇలా ఆయన్ను హైకోర్టు పిలవడం ముచ్చటగా మూడోసారి. ఈసారి అక్రమ మద్యం కేసులకు సంబంధించి. అక్రమ మద్యం కేసుల్లో వాహనాల సీజ్‌ – విడుదల వ్యవహారాలపై గౌతమ్ సవాంగ్‌ని న్యాయస్థానం ప్రశ్నించింది. ‘దిగవస్థాయి అధికారులు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు చట్ట నిబంధనలు పాటించడంలేదన్నది హైకోర్టు ఆక్షేపణ.

అడ్వొకేట్‌ జనరల్‌ని వివరాలు కోరితే, ఏజీపీ కోర్టులో మెమో దాఖలు చేయడమేంటి.? ఇది న్యాయ సలహాదారుల వైఫల్యం కాదా.? అని ప్రశ్నించింది న్యాయస్థానం. కరోనా నేపథ్యంలో పోలీసుల తీరు బావుందని కొనియాడుతూనే, చిన్న చిన్న కేసుల్లో డీజీపీని కోర్టుకు పిలవాల్సిన పరిస్థితిని సలహదారులు కల్పిస్తున్నారని వ్యాఖ్యానించింది న్యాయస్థానం.

ఇటీవల చీఫ్‌ సెక్రెటరీ కూడా న్యాయస్థానం ఎదుట హాజరయిన విషయం విదితమే. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై హైకోర్టు పలుసార్లు మొట్టికాయలు వేసినా.. అధికారులు పట్టించుకోకపోవడం వివాదాస్పదమయ్యింది. మరోపక్క, ప్రతిసారీ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఏకంగా న్యాయవ్యవస్థపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

‘ప్రభుత్వానికి హైకోర్టు వ్యతిరేకం కాదు. ఏ వ్యక్తిమీదగానీ, ప్రభుత్వానికిగానీ న్యాయస్థానాలకు వ్యతిరేక భావనలు వుండవు..’ అని హైకోర్టు నిన్న వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా వుంటే, ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లపై మీడియా సాక్షిగా కూడా సలహాదారులు బొక్కబోర్లా పడుతున్నారు. నేషనల్‌ మీడియాకి సంబంధించిన ఓ ఛానల్‌లో ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై చర్చ జరుగుతుండగా, ‘నాకేం సంబంధం’ అని ఓ ప్రభుత్వ సలహాదారుడు చేతులెత్తేసిన విషయం విదితమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...