Switch to English

ఓటిటి రివ్యూ: కృష్ణ అండ్ హిస్ లీల – ఎంటర్టైన్ చేయలేకపోయిన కృష్ణ.!

Critic Rating
( 2.00 )
User Rating
( 4.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie కృష్ణ అండ్ హిస్ లీల
Star Cast సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి
Director రవికాంత్ పేరేపు
Producer సంజయ్ రెడ్డి, సురేష్ ప్రొడక్షన్స్, వయోకామ్ 18 స్టూడియోస్
Music శ్రీచరణ్ పాకాల
Run Time 2 గంటల 5 నిముషాలు
Release జూన్ 25, 2020

మొదటి సినిమా ‘క్షణం’ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో, ‘గుంటూరు టాకీస్’ తో గుర్తింపు తెచ్చుకున్న సిద్దు హీరోగా రూపొందిన సినిమా ‘కృష్ణ అండ్ హిస్ లీల’. లాక్ డౌన్ సమయానికే అన్ని పనులు పూర్తి చేసుకొని సమ్మర్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాని థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకూ వెయిట్ చేయడం కష్టమని భావించిన నిర్మాతలు ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ద్వారా నేడు రిలీజ్ చేశారు. మరి ఈ కృష్ణ లీలలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

కథ:

‘కృష్ణ అండ్ హిస్ లీల’ కథ పలు మలుపులతో కూడుకున్న ఓ కన్ఫ్యూజ్డ్ బాచిలర్ అయిన కృష్ణ(సిద్దు) గాడి ప్రేమ కథ, కాదు ప్రేమ కథలు. అసలు కథలోకి వెళితే.. కృష్ణ తన ఫస్ట్ లవ్ అయిన సత్య(శ్రద్ధ శ్రీనాథ్) తో బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి రాధ(షాలిని వడ్నికట్టి)తో ప్రేమలో పడతాడు. ఎప్పుడైతే రెండోసారి ప్రేమలో పడతాడో అక్కడి నుంచీ మళ్ళీ కృష్ణ లైఫ్ గందరగోళంగా మారుతుంది. ఇక అక్కడి నుంచి కృష్ణ – రాధల ప్రేమ ఏమయ్యింది? వీరి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అన్నదే మిగిలిన కథ.

తెర మీద స్టార్స్..

నటీనటుల పరంగా అందరూ వారి వారి పాత్రలకి న్యాయం చేశారు. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది సిద్దు.. తన గుంటూరు టాకీస్ మూవీకి ఇందులో చేసిన కృష్ణ పాత్రకి ఏ మాత్రం సంబంధం ఉండదు. కృష్ణ పాత్రలో పూర్తి డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా.. చాలా ఎనర్జిటిక్ గా ఈ రోల్ చేసాడని చెప్పచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ బాగా చేసాడు, అలాగే అక్కడక్కడా కామెడీ టైమింగ్ బాగుంది. హీరోయిన్స్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది షాలిని వడ్నికట్టి గురించి.. ప్రేమలో పడ్డ అమ్మాయిలో ఉండే రకరకాల షేడ్స్ ని షాలిని పర్ఫెక్ట్ గా చేసింది. తన పాత్రకి షాలిని ది బెస్ట్ అనిపించుకుంది. ఇక సిద్దుకి సీనియర్ గా బోల్డ్ అండ్ డేరింగ్ పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ బాగా చేసింది. కానీ తను చేసిన ‘జెర్సీ’ సినిమాలో కూడా తన పాత్రలోని షేడ్స్ కొంతమేర ఇలానే ఉంటాయి కాబట్టి ఆ పాత్రకి కాస్త సిమిలర్ గా కూడా అనిపిస్తుంది. సీరత్ కపూర్ తన పాత్రకి న్యాయం చేసి వెళ్ళిపోయింది. ఇక ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్లో వైవా హర్ష అక్కడక్కడా కాస్త నవ్వించడానికి ట్రై చేసాడు.

తెర వెనుక టాలెంట్..

క్షణం లాంటి సూపర్ ఎంగేజింగ్ థ్రిల్లర్ తీసిన రవికాంత్ పేరేపు ఈ సారి కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. ఈ కథ మొత్తం హీరో తన గర్ల్ ఫ్రెండ్స్ ని చీట్ చేసే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కథల్లో హీరో పాత్రని పాజిటివ్ గా చూపడం కాస్త కష్టం, ముఖ్యంగా కృష్ణ పాత్రకి రాసుకున్న మెయిన్ థీమ్ అందరినీ కన్విన్స్ చేసేలా లేదు. ఈ కథని కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా చెప్పి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. అలాగే శ్రీచరణ్ పాకాల పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ అక్కడక్కడా ఉపయోగించిన ఫెమస్ తమిళ్ రాగ ‘అలై పాయుతే’ మాత్రం సెట్ కాలేదు. సినిమా ప్రారంభంలో వచ్చే ప్రణవ్ చాగంటి తెలుగు రాప్ సాంగ్ బాగుంది.

విజిల్ మోమెంట్స్:

– సిద్దు పెర్ఫార్మన్స్
– మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– మోడరన్ టచ్ మేకింగ్ స్టైల్

బోరింగ్ మోమెంట్స్:

– సిద్దు పాత్రని బెటర్ గా డిజైన్ చేసి ఉండాల్సింది
– కామెడీ లేకపోవడం

విశ్లేషణ:

‘కృష్ణ అండ్ హిస్ లీల’ అనేది ఓ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ.. సరైన హీరో పాత్ర రాసుకొని ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. అలాగే ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి ట్రై చేసి ఉంటే చూసేవారు మరింత ఎంజాయ్ చేయగలిగేవారు. కామెడీ అనుకున్న స్థాయిలో లేకపోవడం వలన చాలా చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది.

చూడాలా? వద్దా?: థియేటర్స్ లో అయితే చూసే సినిమా కాదు, డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయ్యింది కాబట్టి మీ టైంని బట్టి టైం పాస్ కోసం చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....