Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతిపై అధికార పార్టీ ఆలోచన మారుతోందా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో అమరావతి పోరు పెద్దగా కన్పించడంలేదుగానీ, ఇప్పటికీ ‘రాజధాని అమరావతి’ డిమాండ్‌, ఆ ప్రాంత రైతుల్లో అలాగే వుంది. ఆ డిమాండ్‌కి వ్యతిరేకంగా, ‘మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ ఓ ‘పెయిడ్‌ ఉద్యమాన్ని’ నడుపుతోందనుకోండి.. అది వేరే విషయం. ఆ పెయిడ్‌ ఉద్యమం ఎప్పుడో అటకెక్కగా, అమరావతి రైతులు మాత్రం, కరోనా లాక్‌డౌన్‌లోనూ స్వచ్ఛందంగా తమ ఇళ్ళ వద్దనే రాజధాని కోసం ఉద్యమిస్తున్నారు.

ఇదిలా వుంటే, వరుసగా న్యాయస్థానాల్లో తగులుతున్న ఎదురు దెబ్బలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిఫెన్స్‌లో పడిందనీ, మూడు రాజధానుల వ్యవహారం బెడిసికొట్టేలా వుండడంతో, అమరావతి మీద ఫోకస్‌ పెట్టడమే మంచిదన్న నిర్ణయానికి అధికార పార్టీ పెద్దలు వచ్చారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

‘రానున్నది మరింత గడ్డు కాలం. కరోనా దెబ్బకి రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. ప్రస్తుతానికి ఎలాగోలా బండి నడుస్తున్నా.. ముందు రాష్ట్రాన్ని మరిన్ని ఆర్థిక సమస్యలు ముంచెత్తుతాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం అందేలా లేదు. అదనపు నిధులు ఆశించే పరిస్థితీ లేదు. ఈ తరుణంలో అమరావతిని అభివృద్ధి చేసుకోవడమే బెటర్‌..’ అన్న అభిప్రాయం ఆఫ్‌ ది రికార్డ్‌గా అధికార పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది.

ఇంకోపక్క, ‘విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు..’ అని కొందరు వైసీపీ నేతలు నినదిస్తున్నా.. వారి వాదన కూడా ముందు ముందు డైల్యూట్‌ అయిపోయేలానే కన్పిస్తోంది. కర్నూలు విషయంలో అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమైన విషయం విదితమే. అయితే, అమరావతి పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేసిన మాట వాస్తవం. అదే సమయంలో, అమరావతిలో ‘తాత్కాలికం’ పేరుతోనే అయినా అసెంబ్లీ కట్టారు.. సెక్రెటేరియట్‌ కట్టారు.. హైకోర్టు కూడా నిర్మితమైంది.. ఇంకా చాలా అధికారిక భవనాల నిర్మాణం కూడా జరిగింది. పేరు తాత్కాలికమే అయినా, అవేవీ ఆషామాషీ భవనాలు కావు. ఇప్పుడు వాటన్నిటినీ సద్వినియోగం చేసుకోవడంతోపాటుగా, మరికొన్ని శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభమయి.. ఆగిపోవడంతో, వాటిని పూర్తి చేసుకోవడం మీద ప్రభుత్వం ఫోకస్‌ పెట్టబోతోందట.

అదే నిజమైతే, రాష్ట్రానికి కాస్త ఊరటగానే చెప్పుకోవాల్సి వుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖని రాజధానిగా చేయాలన్నా.. దాని కోసం బోల్డంత ఖర్చు చేయాల్సి వుంటుంది. దానికంటే, అమరావతిని కాస్తో కూస్తో అభివృద్ధి చేసుకోవడం బెటర్‌.. అన్న ఆలోచన ప్రభుత్వానికి వస్తే అంతకన్నా కావాల్సిందేముంది.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...