Switch to English

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి దిగడం, ఈ క్రమంలో ఇరు వర్గాలూ కొట్లాటకు దిగడంతో, ఓ గ్యాంగ్‌కి చెందిన లీడర్‌ని మరో గ్యాంగ్‌ హతమార్చింది. తొలుత ఈ ఘటనకు కారణం వైఎస్సార్సీపీ.. అంటూ ప్రచారం జరిగింది. టీడీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘వైసీపీ రౌడీయిజం’ అంటూ ప్రచారం చేశాయి.

మరోపక్క, ఈ ఘటనలో చనిపోయింది టీడీపీకి చెందిన వ్యక్తి.. అంటూ అధికార వైసీపీకి చెందిన మీడియా సంస్థ తేల్చి చెప్పింది. టీడీపీ నేతలతో మృతుడు సందీప్‌ సన్నిహితంగా వున్న ఫొటోల్ని వైసీపీ అధికార మీడియా వెలుగులోకి తెచ్చింది. కాగా, ఇటీవలే సందీప్‌ ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడనీ, ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌ చనిపోతే, 6 లక్షలకు సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడనీ, ఈ వివాదంలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అతనికి సహాయ సహకారాలు అందించాడనీ బెజవాడలో ప్రచారం జరుగుతోంది. మరోపక్క, సందీప్‌ భార్యకు, వైసీపీకి చెందిన ఓ మంత్రికీ బంధుత్వం వుందనే విషయాన్ని తెరపైకి తెస్తున్నారు బెజవాడ వాసులు.

కాగా, ఈ హత్యలో ప్రత్యర్థి గ్రూప్‌ లీడర్‌ మణికంఠ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికీ బలమైన గాయాలయ్యాయి. సందీప్‌కి చెందినదిగా చెప్పబడ్తోన్న ఓ స్టీల్‌ దుకాణం కూడా వైసీపీ నేత నుంచి లీజ్‌కి పొందినదేనట. ప్రస్తుతం సందీప్‌, వైసీపీకి చెందిన ఓ యువనేత అనుచరుడిగా చెలామణీ అవుతున్నాడు. ఆ యువనేత 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా, ఓటమి పాలయ్యాక.. వైసీపీలో చేరాడు. ఇదిలా వుంటే, రెండు గ్యాంగుల మధ్య గొడవని రెండు పార్టీల మధ్య గొడవలా చిత్రీకరించేందుకు అధికార పార్టీకి చెందిన మీడియా పడరాని పాట్లూ పడుతోంది.

ఈ గొడవతో అస్సలేమీ సంబంధం లేని జనసేనని కూడా ఇందులోకి లాగేందుకు సదరు మీడియా సంస్థ పడుతున్న పాట్లు బెజవాడ వాసుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. రౌడీ గ్యాంగ్‌లు.. తమ పలుకుబడి పెంచుకోవడం కోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల చుట్టూ తిరగడం మామూలే. వారి వారి ఫొటోలు పెట్టుకోవడమూ సర్వసాధారణం. మొత్తమ్మీద, తమ పోలీసింగ్‌ అత్యద్భుతం అని చెప్పుకుంటోన్న అధికార పార్టీ, తమ హయాంలో బెజవాడ నడిబొడ్డున.. ఇంత పెద్ద ఘటన జరిగితే, దాన్ని తమ పాలనా వైఫల్యంగా చెప్పుకోలేక.. రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...