Switch to English

లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కేసు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

దివంగత ఎన్టీఆర్ భార్య, వైఎస్సార్ సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆమె తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు. వాటిని పరిశీలించిన పోలీసులు లక్ష్మీపార్వతిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

వినుకొండ సమీపంలోని ఉప్పరపాలేనికి చెందిన బోరిగొర్ల కోటి అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. తాను నాలుగేళ్లుగా లక్ష్మీపార్వతి వద్ద పనిచేస్తున్నానని, ఆమె బారి నుంచి తనను కాపాడాలని, కొంతకాలంగా తనను లైంగికంగా తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడం కలకలం సృష్టించింది. ఆమె పైకి ఒకలా, లోపల మరోలా ఉంటుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కోరిక తీర్చాలంటూ ఎంతో ఒత్తిడి చేశారని, అశ్లీల వీడియోలు కూడా పంపించేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏడాదిగా ఆమె ప్రవర్తన బాగోలేదని, తాను ఎంతలా చెప్పినా వినిపించుకోకుండా వేధింపులకు పాల్పడ్డారని లక్ష్మీపార్వతిపై ఆరోపణలు చేశాడు. ఏడాదిగా తనకు, ఆమెకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను కూడా ఓ టీవీ ఛానల్ కు అందజేశాడు. తాను ఆమెను తల్లిలా భావించానని, కానీ ఆమె మాత్రం తనను మరోలా చూశారని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ను కూడా ఆమె చాలా సార్లు తిట్టారని వెల్లడించాడు. తాను చెప్పినట్టుగా వింటే వైఎస్సార్ సీపీలో మంచి పోస్టు కూడా ఇప్పిస్తానని ఆఫర్ చేశారని, కానీ తనకు అలాంటివి ఇష్టం లేదని, అందువల్లే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కోటి పేర్కొన్నాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రాంగోపాల్ వర్మ ఆమెను చాలా ఉన్నతంగా చూపించారని, కానీ అసలు కథ అది కాదని, వర్మ తన దగ్గరకు వస్తే స్టోరీ మొత్తం చెబుతానని, దమ్ముంటే ఆ సినిమా తీయాలని సవాల్ చేశాడు. ఈ వ్యవహారంలో తనకు ఏదైనా ఆపద వస్తుందనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. తమ ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన ఓ సంభాషణను సైతం అతడు రికార్డు చేశాడు. ఎన్టీఆర్ దుర్మార్గుడు అని, అమ్మాయిల విషయంలో నాదెండ్ల భాస్కరరావు చెప్పిన విషయాలు నిజమే అని చెప్పారని కోటి వెల్లడించాడు.

అయితే, ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందుగా వైఎస్సార్ సీపీ నాయకురాలిపై ఇలాంటి సంచలన ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే లక్ష్మీపార్వతి అలా ప్రవర్తించారా? లేదా ఆమెను ఇరికించే ఉద్దేశంతో ఎవరైనా కుట్ర పన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోటి ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు అతడు అందజేసిన వాట్సాప్ చాట్ ఏ నంబర్ నుంచి వచ్చిందనే అంశాన్ని ధ్రువీకరించుకున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో హోరాహోరీ పోటీ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ దివంగత ముఖ్యమంత్రి భార్య, ప్రతిపక్షానికి చెందిన నాయకురాలిపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. కోటి ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. తనపై వచ్చిన ఈ సంచలన ఆరోపణల విషయంలో లక్ష్మీపార్వతి ఎలా స్పందిస్తారో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

Viral News: ఘరానా మోసం.. రూ.300 విలువైన ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశారు

Viral News: విలువైన, నాణ్యమైన బంగారం అంటూ ఓ అమెరికన్ మహిళను రాజస్థాన్ కు చెందిన నగల వ్యాపారి మోసం చేయడం విస్తుగొలుపుతోంది. కేవలం రూ.300 విలువ చేసే ఆభరణాలను రూ.6కోట్లకు అమ్మేశాడు....

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీల్లో మెగాస్టార్...