Switch to English

గ్రామ వాలంటీర్లు.. ‘నిలువు దోపిడీ’ చేసేస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముంచేస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌లో షరా మామూలుగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి తోడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘గ్రామ వాలంటీర్ల’ పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు ఒకింత హాస్యాస్పదంగా మారుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే, చాలా చోట్ల గ్రామ వాలంటీర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరుని ప్రశంసించకుండా వుండలేం.

అదే సమయంలో, కొందరు వాలంటీర్ల ‘కక్కుర్తి’నీ ప్రశ్నించకుండా వుండలేం. ప్యాకెట్ల రూపంలో ప్రభుత్వం, ప్రజలకు రేషన్‌ అందిస్తోన్న విషయం విదితమే. అందులో దోపిడీకి వాలంటీర్లు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాధారాలతో సహా సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్‌ కన్పిస్తున్నాయి. మరోపక్క, సామాజిక పెన్షన్ల నుంచీ కొందరు వాలంటీర్లు కమిషన్‌ దండుకుంటున్న వైనం వెలుగు చూస్తోంది.

వాలంటీర్లకు సంబంధించిన ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో, ఏ పెన్షన్‌ నుంచి ఎంత కమిషన్‌ రాబట్టాలనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. అయితే, సోషల్‌ మీడియాలో వచ్చే కథనాల్ని పూర్తిగా నమ్మేయడానికి వీల్లేదు. అదే సమయంలో, జరుగుతున్న అక్రమాలపై జనం ఎవరికీ ఫిర్యాదు చేయలేక, సోషల్‌ మీడియాని ఆశ్రయిస్తున్నారన్న వాదనల్నీ కొట్టి పారేయడానికి వీల్లేదు.

ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు రావడం సహజమే. ఆ విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో అధికార పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం మరింత రాజకీయ దుమారానికి కారణమవుతోంది. విపక్షాల విమర్శల నేపథ్యంలో, గ్రామ వాలంటీర్లపై ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం తరఫున అధికార పార్టీ నేతలు స్పష్టతనివ్వడం మంచిదే.

కానీ, ఆ పేరుతో రాజకీయ విమర్శల పర్వం కొనసాగిస్తే దాని వల్ల ప్రయోజనమేంటి.? ఇది కష్ట కాలం.. అధికార పార్టీ ‘పెద్దన్న’ పాత్ర పోషించి అన్ని రాజకీయ పార్టీల్నీ కలుపుకుపోవాలి. విపక్షాల నుంచి వచ్చే విమర్శలు కావొచ్చు, సూచనలు కావొచ్చు.. వాటిని అధికార పక్షం పరిగణనలోకి తీసుకుంటే, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...