Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: జగన్‌ సర్కార్‌ని కూల్చడం పవన్‌కి సాధ్యమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనివ్వనంటూ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా శపథం చేసేశారు. రాజకీయాల్లో ఇలాంటివి చాలానే చూస్తుంటాం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు విషయంలో జగన్‌ ఇలాంటి మాటలే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జగన్‌ని ఉద్దేశించి చంద్రబాబు కూడా ఇలాగే మాట్లాడారు. ప్రత్యర్థి గురించి ఇలా మాట్లాడటం రాజకీయాల్లో కొత్తేమీ కాదుగానీ, జనసేన ఏదన్నా మాట్లాడితే మాత్రం.. అది ఓ రేంజ్‌లో రీ-సౌండ్‌ వచ్చేస్తోంది.

తాజాగా, పవన్‌ కళ్యాణ్‌ ఇంకో అడుగు ముందుకేసి, జగన్‌ సర్కార్‌ని కూల్చేస్తామని షాకింగ్‌ ప్రకటన చేశారు. 151 మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రభుత్వాన్ని ఒక్క ఎమ్మెల్యే బలం మాత్రమే వున్న పార్టీ కూల్చేస్తుందా.? తాజా సమీకరణాల్ని బట్టి చూస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మొత్తం 154 మంది ఎమ్మెల్యేల బలం వుంది. జనసేన పార్టీ బలం జీరో అయిపోయింది.

రానున్న వారం పది రోజుల్లో.. వైసీపీ బలం 160 దాటిపోతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, జనసేనాని వ్యాఖ్యల్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంత తేలిగ్గా తీసుకోవడంలేదు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా.. చంద్రబాబుని వైసీపీ లైట్‌ తీసుకుందేమోగానీ, పవన్‌ కళ్యాణ్‌ని లైట్‌ తీసుకోలేదు. అది పవన్‌ కళ్యాణ్‌ మీద ఆ పార్టీకి వున్న అసహనం వల్లే కావొచ్చు.. మరో కారణం కావొచ్చు. తన వెనుకాల ఏ బలమూ లేకపోయినా, పవన్‌ కళ్యాణ్‌ ఎందుకింతలా ‘పెద్ద పెద్ద’ మాటలు మాట్లాడుతున్నారు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

టీడీపీని తొలుత దెబ్బకొట్టి, ఆ తర్వాత వైఎస్సార్సీపీని దెబ్బకొట్టాలని గతంలో బీజేపీ వ్యూహం పన్నింది. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలెవరూ బీజేపీ వైపు వెళ్ళలేదు సరికదా, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ మద్దతుని కోరింది. దాంతో, ఈక్వేషన్స్‌ మారాయి. ఏపీలో బలపడాలంటే బీజేపీకి సరైన నాయకత్వం అవసరం. ఆ నాయకత్వం పవన్‌ కళ్యాణ్‌లో బీజేపీలోకి కనబడుతున్నట్లుంది. ఆ నాయకత్వ లక్షణాలు పవన్‌కి వున్నాయా.? లేదా.? అన్నది వేరే చర్చ.

వైఎస్సార్సీపీ నుంచి పవన్‌ కళ్యాణ్‌ వైపు కొందరు ఎమ్మెల్యేలు చూస్తున్నారంటూ బీజేపీ లీకులు సృష్టిస్తుండడం.. ఓ సామాజిక వర్గం, వైసీపీలో ఇమడలేకపోతోందనీ, అది జనసేన వైపు నడుస్తోందనీ చర్చ జరుగుతుండడం.. ఇవన్నీ వెరసి, రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు ఆస్కారం ఏర్పడేలానే వుంది. అయితే, అదంత తేలికైన వ్యవహారం కాదు. అదే సమయంలో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాన్ని పవన్‌ కూల్చేస్తారని ఎవరూ నమ్మరుగానీ.. ప్రభుత్వానికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసే సత్తా అయితే పవన్‌ కళ్యాణ్‌కి వుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....