Switch to English

ఎలా ఉండే వర్మ ఎలా అయిపోయాడు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు కాబోయే దర్శకులలో ఎంతో క్రేజ్ ఉండేది. దర్శకుడు కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక్క సినిమాకైనా వర్మ దగ్గర శిష్యరికం చేయాలని ఉబలాటపడిన వాళ్ళే. ఒకప్పుడు ఎలా సినిమాలు తీయాలో అందరికీ చూపిన వర్మ ఇప్పుడు ఎలా తీయకూడదో అన్నట్లుగా సినిమాలు చేస్తూ అందరినీ విసిగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ దగ్గరనుండి ఒక నిఖార్సైన సినిమా వచ్చి ఎన్నేళ్లు అయిందో లెక్కపెట్టడం కూడా కష్టం.

ఒకప్పుడు ఎలాంటి కథతో సినిమాలు తీయాలోనని ఆలోచించిన వర్మ ఇప్పుడు కథ కంటే ముందు కథలో ఎంత కాంట్రవర్సీ పాయింట్ ఉంది లేదా హీరోయిన్ అందాలను చూపించడానికి ఎంత స్కోప్ ఉంది అంటూ వివిధ రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఒక కథలో కాంట్రవర్సీ ఉందని తెలిస్తే చాలు దానిపై చక్కగా వాలిపోతున్నాడు. ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో వర్మ బాగానే వెనకేసుకున్నాడు. అయితే ఈ సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అమ్మ రాజ్యంలో సినిమాకైతే ఎన్నెన్ని విమర్శలు వచ్చాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ పప్పులు ఉడకవని అంతా భావించారు.

అయితే సినిమాను ఏం చేసైనా సరే మార్కెట్ చేసుకోవడం, తన సినిమా గురించి అందరూ మాట్లాడేలా చేయడం వర్మ స్టైల్. తన లేటెస్ట్ సినిమా బ్యూటిఫుల్ ను ఎవరూ కేర్ చెయ్యట్లేదు. హీరోయిన్ నైనా గంగూలీ అందాలను ఎంతలా ఎర వేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. అందుకే వర్మ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసాడు. సాధారణంగా తన స్పీచ్ లతో అందరినీ అలరించే వర్మ ఈసారి స్టేజ్ మీద హీరోయిన్ తో కలిసి విచిత్రమైన డ్యాన్స్ లు వేస్తూ చిత్రవిచిత్రంగా బిహేవ్ చేసాడు. పబ్లిసిటీ కోసం వర్మ ఎంతలా దిగజారిపోయాడో, ఎలా ఉండే వర్మ ఎలా అయిపోయాడోనని ఫిల్మ్ నగర్ కూడళ్లలో చర్చించుకుంటున్నారు.

4 COMMENTS

  1. 923049 697506Nice post. I be taught one thing more challenging on completely different blogs everyday. It will all the time be stimulating to learn content material from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net blog. Thanks for sharing. 848235

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఎక్కువ చదివినవి

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

జైలు నుంచి విడుదలైన నటి హేమ

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన...

Cabinet Ministers: కేంద్ర మంత్రులు, శాఖలు.. రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్

Cabinet Ministers: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మోదీ 3.0 క్యాబినెట్ లో వారికి శాఖల...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచింది....