Switch to English

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. దటీజ్ కేసీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రెండు నిమిషాలపాటు ఊపిరాడకుండా చేస్తే.. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? గాలి ఉంటే చాలు ఇంక ఏమీ వద్దులే అని ఆ క్షణానికి అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి కూడా అలాగే ఉంది. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం ఇదే మాదిరిగా ఉంది. దాదాపు రెండు నెలలపాటు అస్సలు ఏమీ పట్టనట్టే గట్టిగా వ్యవహరించారు. దీంతో యూనియన్ నేతలు ఒక్కో మెట్టే దిగుతూ వచ్చారు.

చివరకు కార్మికులకు తమ ఉద్యోగాలైనా ఉంటాయా లేదా అనే భయాందోళనలు కలిగాయి. దీంతో డిమాండ్లు లేవు గిమాండ్లూ లేవు.. ఉద్యోగాలు ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చేశారు. వారు వచ్చేశారు అనడం కన్నా.. వారికి ఆ పరిస్థితి వచ్చేలా చేయడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారు అంటే కరెక్టేమో. అందుకే.. ఎలాంటి షరతులూ లేకుండా అందరూ వచ్చి ఉద్యోగాల్లో చేరండి అని కేసీఆర్ పిలుపునివ్వగానే.. బతుకు జీవుడా అంటూ అందరూ శుక్రవారం ఉదయమే విధుల్లోకి చేరిపోయారు.

తిరిగి ఉద్యోగాల్లోకి చేరడంతో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. తన మాట వింటే సింగరేణి కార్మికుల తరహాలో బాగా చూసుకుంటానని కేసీఆర్ పేర్కొనడంతో ఇకపై ఆయన మాటే వింటామని పేర్కొనడం గమనార్హం. రెండు నెలలపాటు ఎన్నో బాధలు పడినప్పటికీ, తిరిగి ఉద్యోగాలు ఇవ్వడంతో కేసీఆర్ పట్ల కార్మికుల వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన్ను దేవుడిలా చూసుకుంటామని, ఇక డిమాండ్లు, జీతాలు తదితరాలన్నీ ఆయన దయ అని పేర్కొంటున్నారు.

ఇలా రెండు నెలలుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ సింపుల్ గా పరిష్కారం చూపించారు. మరోవైపు ఇదే సమయంలో ఆర్టీసీ చార్జీల పెంపునూ సింపుల్ గా ప్రకటించేశారు. సంస్థ బాగోగుల కోసం ప్రజలు సహకరించాలని పేర్కొంటూ కిలోమీటర్ కు 20 పైసలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇచ్చేశారు. వాస్తవానికి ఆర్టీసీ చార్జీల పెంపు అనగానే ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఆందోళనలు వస్తాయి.

చార్జీలు ఎంత పెంచాలనే దానిపై ఎంతో కసరత్తు చేయడం.. వాటిని ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించడం.. వాటిని కాస్త తగ్గించి చార్జీలు ఫిక్స్ చేయడం.. ఇదీ ఎప్పుడూ జరిగే తంతు. కానీ ఈసారి అలాంటిది ఏమీ లేకుండా, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాని సమయంలో చార్జీలు పెంపును కేసీఆర్ ప్రకటించారు. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా.. అటు ఆర్టీసీ కార్మికులు ఇకపై యూనియన్ల మాట ఎత్తకుండా చేయడంతోపాటు చార్జీల పెంపునూ కానిచ్చేశారు. దటీజ్ కేసీఆర్.

13 COMMENTS

  1. 343477 640315Excellent read, I just passed this onto a colleague who was performing a little research on that. And he really bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 535480

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...