Switch to English

ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. కార్మికులపై కేసీఆర్ కనికరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది. 52 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. ఎలాంటి షరతులూ లేకుండా కార్మికులందరూ తమ ఉద్యోగాల్లో చేరొచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఎవరి డిపోలకు వారు వెళ్లి విధుల్లో చేరొచ్చని సూచించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీకి ఆదేశాలిస్తామని వెల్లడించారు.

గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ వ్యవహారంపైనే ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం కేబినెట్ వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం తమకు లేదని, వారు బాగుండాలనే తాము కోరుకుంటామని స్పష్టంచేశారు.

కార్మికులంతా యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకున్నారని పేర్కొన్నారు. తన మాట వింటే మంచిగా ఉంటారని, సింగరేణి తరహాలో బోనస్ కూడా తీసుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. తమ మాట విని క్రమశిక్షణతో ఉంటే గుండెల్లో పెట్టుకుంటామన్నారు. అనవసరంగా యూనియన్ల ఉన్మాదంలో పడొద్దని సూచించారు.

ఓ పెద్దన్నగా.. తెలంగాణ బిడ్డగా.. కార్మికులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అలాగే నష్టాల ఊబిలో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీలు పెంచక తప్పదని స్పష్టంచేశారు. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీ ఎండీకి వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. సోమవారం నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఆర్టీసీ చార్జీలు పెంచామని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కిలోమీటర్ కు 20 పైసలు పెంచడం వల్ల ఆర్టీసీకి దాదాపు రూ.752 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని, తద్వారా నష్టాలను తగ్గించుకునే అవకాశం వస్తుందన్నారు.

ఇక సమ్మె కాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రతి డిపో నుంచి ఐదుగురు ఆర్టీసీ సిబ్బందిని ప్రగతి భవన్ కు పిలిపించి అన్ని వివరాలూ మాట్లాడతానని, సంస్థ బాగోగులకు ఏం చేయాలో మాట్లాడదామని పేర్కొన్నారు.

యూనియన్లకు బదులు ప్రతి డిపోలో ఇద్దరు సీనియర్లతో మంత్రి అధ్యక్షతన ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. పనిలో పనిగా కేంద్రంపైనా కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. ఆర్టీసీకి రూ.22 వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి నోటీసులు ఇస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టుకు కూడా వెళతామని పేర్కొన్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో కార్మికుల్లో ఆనందం కనిపిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...