Switch to English

శివసేన.. రెంటికీ చెడ్డ రేవడేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదంటారు. వీటిలోకి రాజకీయాలు కూడా చేరాయ్. ఏ పార్టీలోకి ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో కూడా తెలియడంలేదు. ఏ పార్టీ ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, ఏ పార్టీలో ఎప్పుడు చీలిక వస్తుందో కూడా అంతుబట్టడంలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలు చూస్తే ఇది అర్థమవుతుంది. బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయ్.. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాయ్.. చివరకు బీజేపీ, ఎన్సీపీ కలిసి పగ్గాలు చేపట్టాయ్. ఈ మొత్తం వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయింది శివసేన మాత్రమే.

బీజేపీతో కలిసి ఉంటే ఆ పార్టీకి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేది.. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దల అండదండలూ ఉండేవి. కానీ సీఎం కావాలనే తలంపుతో సిద్దాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి ముందుకెళ్లడంతో ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. అటు అధికారమూ పోయింది.. అదనంగా ఇటు బీజేపీతో శతృత్వమూ వచ్చింది. మహారాష్ట్ర పరిణామాలతో కాంగ్రెస్ కు జరిగిన నష్టం ఏమీ లేదు.

ఆ పార్టీ ఎలాగూ ప్రతిపక్షంలోనే ఉండాలనుకుంది. కానీ ఎన్సీపీ అభ్యర్థనతో శివసేనకు మద్దతివ్వడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం శివసేన సర్కారు ఏర్పాటు కాకపోయినా కాంగ్రెస్ కు పోయిందేమీ లేదు. ఇక ఎన్సీపీ విషయానికొస్తే అంకెలాటలో కొంతమంది ఎమ్మెల్యేలు చేజారే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆ పార్టీకి దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఎన్సీపీ ఏమైనా డబుల్ గేమ్ ఆడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కర్ణాటకలో కుమారస్వామి కాంగ్రెస్ తో చేతులు కలిపి గద్దెనెక్కినప్పుడు ఆయన తండ్రి దేవెగౌడ ఎలాంటి వైఖరి అనుసరించారో ఇప్పుడు పవార్ కూడా అలా వ్యవహరిస్తున్నారేమో అని పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇందులో నిజానిజాలను పక్కనపెడితే శివసేన మాత్రం రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టడమే ఆ పార్టీ చేసిన మొదటి తప్పు అని అంటున్నారు. ఇది ఆ పార్టీపై జనాల్లో ప్రతికూల అభిప్రాయం రావడానికి కారణమవుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం పీఠం అధిరోహించాలనే తొందరలో బీజేపీని శివసేన చాలా తక్కువగా అంచనా వేసి భారీ మూల్యం చెల్లించుకుందని చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...