Switch to English

టిబి విశ్లేషణ : కేంద్రం మెలిక.. చిక్కుల్లో ఏపీఎస్ఆర్టీసీ…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆర్టీసీ కార్మికులు గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె అంతా దేనికోసం అంటే… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి… తమ న్యాయబద్ధమైన 26 డిమాండ్లు తీర్చాలి. అన్ని చిన్న చిన్న డిమాండ్లే.. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులతో పోల్చుకుంటే ఇవేమంత పెద్దవి కాదు. కానీ, అందరిలాగే ప్రభుత్వం డిమాండ్లను పక్కన పెట్టేసింది. ఎందుకు తీర్చాలి.. అవసరం ఏంటి.. వాళ్ళే వస్తారులే అని చెప్పి పక్కన పెట్టింది. ఇచ్చిన నోటీసులను పక్కన పడేశారు… కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో కార్మికులకు ఒళ్ళు మండింది.. అక్టోబర్ 5 వ తేదీ నుంచి సమ్మెకు దిగారు.

సమ్మె చేయడం తప్పుకాదు… కానీ, ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టే దసరా, బతుకమ్మ సమయంలో సమ్మెకు దిగటంతో ప్రభుత్వానికి కోపం వచ్చింది. అసలే అధికారంలో ఉన్నది కెసిఆర్ ప్రభుత్వం.. ఆయనకు కోపం జాస్తి.. కాదన్న పనిచేస్తే సహించలేరు. అనుకున్నట్టుగానే సమ్మెకు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా.. సెల్ఫ్ డిస్మిస్ అనే పదాన్ని వాడింది. ఈ పదంతో పై అనేకరోజులు చర్చాగోష్టిలు జరిగాయి. సమ్మెకు వెళ్లారు కాబట్టి ఇక వాళ్ళను ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడటంలేదు అని ప్రభుత్వం చెప్పడంతో…ఉద్యోగులు షాక్ అవుతారని అనుకున్నారు.

ఇలాంటివి ఎన్నింటినో ఆర్టీసీ కార్మికులు చూసి ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ అన్నా పట్టించుకోలేదు. సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది… ఎత్తేస్తున్నాం… ఆర్టీసీ స్థానంలో కొత్త సంస్థను తీసుకొస్తున్నామని కెసిఆర్ హుజూర్ నగర్ ఎన్నికల విజయం తారువాత ప్రకటించారు. ఈ ప్రకటనను చూసి కార్మికులు ఏ మాత్రం భయపడలేదు. ఆర్టీసీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అన్నటుగా మాట్లాడటం కెసిఆర్ కు రుచించలేదు.

ఆర్టీసీ విభజనకు చట్టబద్దత లేదా…

ఆర్టీసీకి సంబంధించిన ఈ కేసు హైకోర్టులో ఉన్నది. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని ఆర్థికశాఖ, ప్రభుత్వం నివేదికలు సమర్పిచ్చింది. ఆర్టీసీ ఎండీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ విభజన కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వం చెప్పడంతో, కోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

విభజనకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో ఉన్నప్పుడు ఆర్టీసీని తెలంగాణా, ఆంధ్ర ఆర్టీసీలుగా ఎలా విభజించారని ప్రశ్నించింది. ఇదే సమయంలో కేంద్రం కూడా తన వాదనలు వినిపించింది.. ఆర్టీసీలో కేంద్రం వాటా 33శాతం ఉందని, అది టీఎస్‌ ఆర్టీసీకి ఆటోమెటిక్‌గా బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అందుకే టీఎస్‌ ఆర్టీసీలో 33 శాతం వాటా అనే ప్రశ్నే తలెత్తబోదని స్పష్టం చేసింది.

ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, టీఎస్‌ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్ధత లేదని పేర్కొంది కేంద్రం. ఏపీఎస్‌ ఆర్టీసీని విభజిస్తే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, కేంద్రం అలాంటి అనుమతి ఇచ్చినట్లు ఆధారాల్లేవని వెల్లడించింది. ఏపీఎస్ఆర్టిసినీ చట్టబద్దంగా విభజన జరగనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ఎలా విలీనం చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఆర్టీసీని విలీనం చేయాలి అంటే ముందు చట్టబద్ధంగా విభజన జరగాలి. చట్టబద్ధంగా విభజన జరగనప్పుడు… రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తెలంగాణా ఆర్టీసీ కార్మికుల పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా చిక్కుల్లో పడింది. ఆర్టీసీని ఏపీ లో ఎలా విలీనం చేస్తారు అనే ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...