Switch to English

స్పెషల్: ‘సైరా’ – పక్కాగా చూడాలి అనడాకికి 5 రీజన్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి 10 ఏళ్ళ క్రితమే ఈ కథ విని, ఇన్నాళ్లు బడ్జెట్ పెట్టె నిర్మాత కోసం వెయిట్ చేసి ఫైనల్ గా తన కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల సినీ అభిమానులు కూడా ‘సైరా’ కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

అసలు ‘సైరా’ సినిమాలో ఇది వరకూ చెప్పని, చూపించని, ఎలాంటి కథ, కాంబినేషన్స్ ఉండబోతున్నాయి.. అసలు ఈ సినిమా మిస్ కాకుండా చూడాలి అనడానికి గల 5 కారణాలు మీకోసం.

1. ప్రపంచానికి తెలియని ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ వీర గాధ.

Auto Draftసుమారు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి, మన సంపద మొత్తం దోచుకున్న బ్రిటీషువారిపై ఎందరో స్వాతంత్య సమరయోధులు పోరాటం చేసి మనకు స్వాతంత్య్రం తెచ్చి పెట్టారని చదువుకున్నాం. కానీ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు మొట్ట మొదట సరిగా స్ఫూర్తిని రగిలించి, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడు మన తెలుగు వాడు, రాయలసీమ గడ్డ మీద జన్మించిన యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’.

కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా చరిత్రలో ఎప్పుడో కనుమరుగైపోయింది. కానీ ఆ వీరుడి కథ ప్రపంచానికి తెలియాలని, ఎంతో పరిశోధించి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాగా తెలుగుతో పాటు పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇది ఎవరికీ తెలియని కథ కాబట్టి ఇందులో ప్రతి పాత్ర, ప్రతి ఎమోషన్, ప్రతి పోరాటం చూసే ప్రేక్షకులకి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. సో డోంట్ మిస్ ఫ్రెండ్స్..

2. పాన్ ఇండియా స్టార్స్ కలిసి చేసిన మొదటి సినిమా .

Auto Draftమామూలుగా కొన్ని పాన్ ఇండియన్ సినిమాలో కొంత పరిచయం ఉన్న లేదా అసలు పరిచయం లేని యాక్టర్స్ కనిపిస్తుంటారు. కానీ ‘సైరా’లో మాత్రం అన్ని భాషల్లో ఇండియన్ రేంజ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు అందరూ కలిసి చేయడం.

>> మొదటగా మెగాస్టార్ చిరంజీవి సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కి పరిచయస్తుడే.

>> అల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ఆయన తెలుగు సినిమాలో లెంగ్త్ ఎక్కువ ఉన్న ఒక ముఖ్య పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

>> తమిళ్ లో సూపర్ స్టార్డం ఉన్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా ఇందులో ఓ వీరుడి పాత్ర చేసాడు. విజయ్ సేతుపతికి కూడా ఇదే మొదటి తెలుగు సినిమా.

>> కన్నా సూపర్ స్టార్ ‘కిచ్చ’ సుధీప్ మరో వీర యోధుడుగా కనిపించనున్నాడు.

>> హీరోయిన్స్ పరంగా నయనతార, తమన్నా, అనుష్క లాంటి పాన్ ఇండియా హీరోయిన్స్ నటించారు.

ఇలా స్టార్డంలో ఓ రేంజ్ లో ఉన్న హీరో – హీరోయిన్స్ కలిసి చేస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ‘సైరా’. సో ఈ కాంబినేషన్ తెరపై ఎలా మిస్ అవ్వగలం.

3. ఫెంటాస్టిక్ గ్రాఫిక్స్ మరియు వార్ ఎపిసోడ్స్

Auto Draft‘బాహుబలి, ‘రోబో’ ల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ ఇండియన్ స్క్రీన్ మీద మొట్ట మొదటిసారి వస్తున్న భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ‘సైరా’. ‘బాహుబలి’ సినిమాలో 2,300 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే ‘సైరా’ లో 3,800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇండియన్ సినిమా పరంగా ఇదే రికార్డ్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటుందనేది.

ఇకపోతే ఇదొక పీరియాడిక్ వార్ ఫిల్మ్.. అందులోనూ బ్రిటిష్ వారి పై పోరాటం చేసిన సినిమా. ముఖ్యంగా 1840లలో జరిగిన కథ కాబట్టి అప్పటి యుద్ధ విధానాలు, టెక్నిక్స్, వారు వాడిన ఆయుధాలు అన్నీ థియేటర్ లో ఆడియన్స్ చేత పక్కాగా ఈలలు వేయిస్తాయి. మరి ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, వార్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాని బిగ్ స్క్రీన్ పై ఎలా మిస్ అవ్వగలం.

4. చిరంజీవి కెరీర్లోనే చేయని జానర్.

Auto Draftమెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం 41 సంవత్సరాలు. ఈ 41 ఏళ్ళలో ఆయన 150 సినిమాల మైలురాయిని ఇటీవలే క్రాస్ చేశారు. చిరు నుంచి వస్తున్న 151వ సినిమా ‘సైరా’. చిరు కెరీర్లో ఇప్పటి వరకూ ఎన్నో రకాల పాత్రల చేశారు కానీ ఒక్క పీరియడ్ ఫిల్మ్ గానీ, వీరుడి పాత్రలో కనిపించలేదు. ఇన్నేళ్ళ కెరీర్లో చిరు చేస్తున్న మొట్ట మొదటి పీరియడ్ ఫిలిం, అందులోనూ వీరోచిత పోరాటాలు చేసే వీరుడిగా చేస్తున్న సినిమా కావడం వల్ల ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. మరి చిరు ముందెన్నడూ చేయని పాత్ర, యుద్ధ భూమిలో పోరాటాలు చేస్తూ దూసుకెళ్తుంటే మనం ఎలా మిస్ అవుతాం.

5. ‘సైరా’లో ‘న భూతో న భవిష్యత్’ అనిపించే కొన్ని ఎపిసోడ్స్ .

Auto Draft

ఎక్కువ ఆధారాలు, ప్రపంచానికి పెద్దగా తెలియని ‘సైరా’ లాంటి కథతో సినిమా చేయడం చాలా కష్టం. కానీ చిరు అనుకున్న డ్రీంని పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకురావడంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సినిమా చేసే టైంలో ఆయన ఫేస్ చేసిన చాలెంజస్ ఎన్నో..

>> స్టార్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ లాంటి సినిమాలో క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అనేది ఇదే మొదటిసారని చెప్పాలి. కథ తప్పుదోవ పట్టకూడదని ఆ ఎమోషనల్ బ్లాక్ ని క్లైమాక్స్ గా ఎంచుకోవడం కూడా చిరు, సురేందర్ రెడ్డి గట్స్ అని చెప్పాలి. మరి ఆ బ్లాక్ అందరి చేత కంటతడి పెట్టించడమే కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ పోరాట స్ఫూర్తిని నింపుతుందని సమాచారం.

>> జార్జియాలోని నొస్సామ్ పోర్ట్ వార్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. 2500 జూనియర్ ఆర్టిస్ట్స్ మరియు ఫైటర్స్ తో 35 రోజులు కేవలం రాత్రి పూట ఈ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేసారు. ఈ ఒక్క వార్ ఎపిసోడ్ కే 70 కోట్ల బడ్జెట్ అయ్యింది.

>> ‘సైరా’లో జాతర అంటూ సాగే ఓ పాటలో 4500 మంది డాన్సర్స్ పార్టిసిపేట్ చేసారు. అలాగే 14 రోజుల పాటు ఈ పాటని షూట్ చేశారు. అన్ని రోజులు ఇంత మందితో లోకేషన్ లో పాట షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.

Auto Draft>> మునుపెన్నడూ లేని విధంగా ‘సైరా’లోని బ్రిటిష్ వారి పాత్రల కోసం డైరెక్ట్ గా లండన్ లోనే ఆడిషన్స్ పెట్టి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నారు.

మరి అసాధ్యం అనుకున్నవి కూడా ఇలా సుసాధ్యం చేసుకుంటూ చేసిన మరెన్నో సన్నివేశాలు, ఫైట్ బ్లాక్స్ ఈ సినిమాలో ఉన్నప్పుడు ఎలా మిస్ అవుతాం.

చూశారుగా ఫ్రెండ్స్, ఇది వరకు చూడని కాంబినేషన్స్, తెలియని, కథ, మరెన్నో అద్భుతమైన అంశాలతో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ని ఎలా చూడకుండా ఉండగలం. ఏమంటారు ఫ్రెండ్స్.. మీ ఒపీనియన్ నికింద కామెంట్స్ లో తెలపండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...