Switch to English

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.!

టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిగా ఏర్పడి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీలో టీడీపీ – జనసేన అనుకూల వర్గం, వైసీపీ అనుకూల వర్గం.. అనేవి వున్నాయి. నిజానికి టీడీపీ అనుకూల, బీజేపీ అనుకూల, జనసేన అనుకూల, వైపీపీ అనుకూల.. అనే నాలుగు వర్గాలుండేవి.

నిఖార్సయిన బీజేపీ వర్గం, అధినాయకత్వం చెప్పినట్లుగా టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇందులో వింతేమీ లేదు. వైసీపీ అనుకూల వర్గమే, టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.

ట్వీట్ల పరంగా కావొచ్చు, స్పేస్‌ల పరంగా కావొచ్చు, బీజేపీ అభ్యర్థుల మీదనే, బీజేపీలోని వైసీపీ వర్గం అత్యంత జుగుప్సాకరమైన నెగెటివిటీ షురూ చేసింది. ప్రధానంగా రాజమండ్రి కూటమి అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై ఈ వర్గం చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు నామమాత్రం. అంటే, ఒకటి నుంచి రెండు శాతమే. కానీ, బీజేపీకి ఆరు లోక్ సభ సీట్లు కూటమి తరఫున దక్కాయి. పది అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ పొత్తులో భాగంగా దక్కించుకుంది. వీటిల్లో ఎన్ని గెలుస్తుంది బీజేపీ.? అంటే, అది జనసేన – టీడీపీ దయ మీద ఆధారపడి వుంటుందన్నది బహిరంగ రహస్యం.

పొత్తుల్లో కొన్ని ఈక్వేషన్స్ వుంటాయి. అవన్నీ ఆయా పార్టీల అధినాయకత్వాలకి తెలుసు. క్యాడర్ కూడా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతుంటుంది. కానీ, బీజేపీలోని వైసీపీ వర్గం మాత్రం, సర్దుకోలేకపోతోంది.. జీర్ణించుకోలేకపోతోంది కూటమిని.

ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రిలో పురంధేశ్వరిని గెలవనివ్వబోమని సోకాల్డ్ ఇంటర్నెట్ మేధావులైన కమలం కార్మికులు శపథాలు చేసేస్తున్నారు. వాటిని బీజేపీ అధినాయకత్వం పట్టించుకోదనుకోండి.. అది వేరే సంగతి. కాకపోతే, బీజేపీ ముసుగేసుకుని, కూటమిని విమర్శిస్తున్నవారి వల్ల, బీజేపీ అభ్యర్థులకు కూటమిలోని ఇతర పార్టీల నుంచి ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది సజావుగా సాగకపోవచ్చు.

ఆల్రెడీ కూటమికి దక్కాల్సిన సీట్లు కాస్తా, బీజేపీకి కేటాయించడంతో.. బీజేపీ ఓటమి అంటే వైసీపీ గెలుపు.. అన్నట్లుగా మారుతుందేమో పరిస్థితి అని టీడీపీ, జనసేన ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

ఏదిఏమైనా బీజేపీలోని వైసీపీ వర్గం పట్ల బీజేపీ అధినాయకత్వం ఒకింత అప్రమత్తంగా వుండాలి. లేదంటే అది కూటమికి చేటు తెస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న దరిమిలా, అప్పటికైనా ఈ గందరగోళం చల్లారుతుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...