Switch to English

వైసీపీ వాలంటీర్ గూడుపుఠానీ.! నష్టపోయేదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏప్రిల్ 1 విడుదల.! తెల్లారింది.. సామాజిక పెన్షన్లను పంచడానికి, తెలవారకుండానే వాలంటీర్లు రంగంలోకి దిగాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. కానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కదా.? వైసీపీ కార్యకర్తలెలా, సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారు.?

అదేంటీ, వాలంటీర్లకీ.. వైసీపీ కార్యకర్తలకీ తేడా వుంది కదా.! ఏదీ, ఎక్కడ.? వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు చాలా సందర్భాల్లో సెలవిచ్చారు. పార్టీ కోసం పని చెయ్యకపోతే వాలంటీర్లను పీకి పారేస్తామని మంత్రులూ హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలేనని సర్టిఫై చేశారు.!

అద్గదీ అసలు సంగతి. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదు. వాళ్ళేమీ ఉద్యోగులు కారు. జస్ట్ వైసీపీ కార్యకర్తలు.. వారికి, వాలంటీర్ అనే ముసుగేసింది వైసీపీ. సో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, ప్రజాధనాన్ని ఏ చట్టబద్ధతా లేని వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ ముసుగేసుకుని, పంచడానికి వీల్లేదు.

ఇది తెలియనంత అమాయకత్వం ప్రభుత్వ పెద్దలకు లేదు కదా.! తెలిసే అంతా చేశారు. వాలంటీర్ వ్యస్థకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు.? వాళ్ళెందుకు ప్రభుత్వ ఉద్యోగులు కాలేకపోయారు.? ఇలాంటి ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానమే దొరకదు. ‘వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ..’ అని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెలవిచ్చారు.

ఇప్పుడేమో, వాలంటీర్ రాకపోవడంతో తమకు పెన్షన్లు అందలేదంటూ అవ్వాతాతలతో వీడియోలు చేయిస్తోంది వైసీపీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేవలేని స్థితిలో వున్న వృద్ధులు, పెన్షన్ల కోసం తల్లడిల్లుతోంటే, చూడ్డానికి ఎవరికైనా బాధగానే వుంటుంది. కానీ, దీనికి బాధ్యత ఎవరు వహించాలి.?

చట్టబద్ధత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు పంచలేకపోతున్నారు.? ఆ ప్రభుత్వ వ్యవస్థని నిర్వీర్యం చేసి, సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ఎందుకు తీసుకొచ్చింది.? ఇదిగో, ఇప్పుడిలా ఎన్నికల ముందర అవ్వాతాతల్ని ఏడిపించి, సింపతీ కొట్టెయ్యడానికి.

చంద్రబాబు పెన్షన్లను ఇవ్వనీయలేదు.. పవన్ కళ్యాణ్ పెన్షన్లు ఇవ్వనీయడంలేదు.. అంటూ వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు వెళ్ళి, లబ్దిదారుల దగ్గర దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళెలా ఆపుతారు.? ఇది ప్రభుత్వ ధనం కదా.. అంటే, ప్రజాధనం కదా.? అని కొందరు లబ్దిదారులు, వాలంటీర్లను నిలదీస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.

అసలు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకి జగన్, వైఎస్సార్ పేర్లెందుకు పెట్టారు.? అలాంటి ఏ పేర్లూ ఇకపై వుండకూడదు.. అసలు వాలంటీర్ వ్యవస్థే వుండకూడదు.. ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు తెచ్చి ఇవ్వాలి.. లేదంటే, మేమే వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్షన్లు తెచ్చుకుంటాం.. అని జనం అంటున్న పరిస్థితీ కనిపిస్తోంది.

గ్రౌండ్ రియాల్టీ.. వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది. కానీ, వైసీపీ అనుకుల మీడియాలో.. బోల్డంత దుష్ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, మూడో తేదీనే పెన్షన్లు.. అని సాక్షి పత్రికలో గతంలోనే రాశారు. అలాంటప్పుడు, ఏప్రిల్ 1వ తేదీన ఎందుకింత రచ్చ.? ఆల్ ఫూల్స్ డే రోజున.. వాలంటీర్లని వైసీపీ ఫూల్స్‌ని చేసినట్లుంది.!

సెల్ఫ్ గోల్ అంటాం కదా.. అదే ఇది.! వాలంటీర్ లాంటి సమాంతర వ్యవస్థలు సమాజానికి ఎంత చేటు.? అన్న విషయం.. ఇదిగో, ఇలా నిరూపితమవుతోందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...