Switch to English

పవన్ కళ్యాణ్‌ని గెలిపించే బాధ్యత వర్మదే.! ఇదే రాజకీయమంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మనం కూడా రాజకీయం చేద్దాం.! ఈ మాట కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్వుతూ పార్టీ కార్యకర్తల సాక్షిగా అన్నారు. ఔను, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. అప్పుడే అది రాజకీయం అవుతుంది. రాజకీయం అంటే సేవ.. అన్నది ఒకప్పటి మాట. రాజకీయాల్లోకి సేవ చేసేందుకు వచ్చేవాళ్ళ సంఖ్య దాదాపు శూన్యమైపోయాక.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చిత్తశుద్ధితో సేవ చేస్తానంటే.. జనం ఓడించి తీరతారు.. గతంలో అదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అనుభవమూ ఇదే.

‘అయినా, రాజకీయాల్లో అవినీతిపరులు కానోళ్ళెవరు.?’ అన్న మాటకి జనం స్టిక్ ఆన్ అయిపోయారు. ‘ఎవడొచ్చినా, అడ్డగోలుగా దోచేస్తాడు. ఈ దోపిడీని మనం ఆపలేం. ఆ దోపిడీలో మనమూ భాగమైపోదాం..’ అని జనం అనుకోబట్టే, సంక్షేమ పథకాల ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువైపోయాయ్.

సరే, అదంతా వేరే చర్చ. అసలు ఈ చర్చ ఇప్పుడెందుకు.? అంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘పవన్ కళ్యాణ్ గనుక కూటమి తరఫున పోటీ చేస్తే, ఆయన్ని లక్ష మెజార్టీతో గెలిపిస్తాను. అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన పనిలేదు. ఆయన్ని గెలిపిస్తాను.. ఆ విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ఆయనకి ఇస్తాను..’ అని కొన్నాళ్ళ క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సెలవిచ్చారు.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం టిక్కెట్ ఖాయమైందో, ఆ వెంటనే వర్మ ప్లేటు ఫిరాయించాడు. టీడీపీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా నినదించేలా చేశాడు వర్మ. ఏమయ్యిందోగానీ, వర్మ సర్దుకుపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారాయ్.

వర్మ మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి లక్ష మెజార్టీ ఖాయమన్న ప్రచారం తెరపైకొచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. దాంతో, వర్మ ఖంగు తిన్నాడు. వెంటనే, పవన్ కళ్యాణ్‌కి బాహాటంగా మద్దతు పలికాడు.

ఇంకేముంది.? వివాదం సమసిపోయినట్లే.! ఏమో, వర్మ ప్లేటు ఫిరాయిస్తే.? వైసీపీతో చేతులు కలిపితే.? ఈ అనుమానాలు అటు టీడీపీలో, ఇటు జనసేనలో వున్నాయి. ఆ అనుమానాలకు ఆస్కారం లేకుండా, ‘నా గెలుపు బాధ్యత వర్మదే..’ అని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ‘ఔను, పవన్ కల్యాణ్ గెలుపు బాధ్యత నాది’ అని వర్మ కూడా చెప్పాల్సి వచ్చింది.

ఇప్పుడిది వర్మకి ‘ఇజ్జత్ కా సవాల్’ అయిపోయింది. టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ లేనంత యాక్టివ్ అవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో. జనసేన శ్రేణులతో మరింత సోదర భావంతో వుంటున్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కార్యకర్తలు పిఠాపురంలో కలిసి పని చేస్తున్న తీరు అధికార వైసీపీకి పెద్ద షాక్ ఇస్తోంది.

ఔను, పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలు పెట్టారు.! ఇంతకు ముందెన్నడూ పవన్ కళ్యాణ్‌లో కనిపించని రాజకీయమిది.! కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, తాడేపల్లి గూడెం కావొచ్చు, నిడదవలో కావొచ్చు, నర్సాపురంలో కావొచ్చు, మరో నియోజకవర్గంలో కావొచ్చు.. జనసేన అభ్యర్థుల గెలుపు తమ బాధ్యత అని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు.

మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గెలుపు తమ బాద్యత అని జనసేన శ్రేణులూ చెప్పగలుగుతున్నాయి. ఇదీ రాజకీయమంటే.! స్ట్రైక్ రేట్ 98 శాతం వుండాలని గతంలో జనసేనాని అన్నారుగానీ, ఇప్పుడైతే 100 శాతం స్ట్రైక్ రేట్ దిశగా జనసేన దూసుకుపోతోంది.! రాజకీయం అంటే ఇలానే చెయ్యాలి.! రాజకీయం బాగా వంటబట్టేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...