Switch to English

YSRCP: వైసీపీ కొంప ముంచిన గ్రాఫిక్స్.! పార్టీ శ్రేణులు కకావికలం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజానీకం తిరుపతికి తరలి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి పెద్ద పొలిటికల్ ఈవెంట్ అది. దాన్ని తలదన్నే పొలిటికల్ ఈవెంట్ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగింది లేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే రాజకీయ సభలకీ పెద్దయెత్తున జనం తరలి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులే అనండీ.. ఇంకోటనండీ.. జనసేన కార్యక్రమాలకు జనాల్ని తరలించాల్సిన అవసరం వుండదు.

వేరే రాజకీయ పార్టీలు ఏవి ఎక్కడ ఎలాంటి రాజకీయ సభలు పెట్టినా జనాల్ని తరలించాల్సిందే. అన్నట్టు, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జనం స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారనుకోండి.. అది వేరే వ్యవహారం.

వైఎస్ జగన్ పాదయాత్రలకి జనాన్ని ప్రతిరోజూ మేపాల్సి వచ్చేది. అదే పద్ధతి నారా లోకేష్ పాదయాత్రలోనూ ఫాలో అయ్యారు టీడీపీ నేతలు. ప్రతిరోజూ జనాన్ని చూపించాలంటే, పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిందే.

ఇక, అసలు విషయానికొస్తే, ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభలకు ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చయ్యిందనేది ఓ అంచనా. బహిరంగ సభల నిర్వహణ, ప్రచార ఖర్చు.. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు వెయ్యి కోట్లు వైసీపీ ఖర్చు చేసిందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం జనాల్ని తరలించడానికే వినియోగించారట.

మూడు లక్షలు, ఆరు లక్షలు, పది లక్షలు, పదిహేను లక్షలు.. ఇలా పెంచుకుంటూ పోయారు. అద్దంకిలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభకి 15 లక్షల మంది వచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది.. కాదు కాదు 18 లక్షలని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, విజువల్స్ చూస్తే, లక్షన్నర మంది కూడా వచ్చి వుండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తోడు, అక్కడ ఫొటో ఎడిట్లు, గ్రాఫిక్స్ వినియోగం.. ఇవన్నీ చూశాక, ‘బొత్తిగా ఖర్చు దండగ సిద్ధం’ అంటూ వైసీపీ శ్రేణులే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. జాతీయ మీడియా సైతం, ఈ గ్రాఫిక్స్ బహిరంగ సభని ఏకి పారేస్తుండడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు ఇలా గ్రాఫిక్స్ మీద ఆధారపడి జనాల్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసింది లేదు. ఈ విషయంలో వైసీపీ ట్రాక్ రికార్డ్ వేరే లెవల్ అంతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...